కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. 12 రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్న ఫార్మాసిస్ట్.. శుక్రవారం తుది శ్వాస విడిచింది. నాగాంజలి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల వల్ల పార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడు దీపక్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు అనంతలక్ష్మి, దుర్గారావులు కోరుతున్నారు.
Also Read: Telangana: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. !
అసలేం జరిగిందంటే...
కాగా.. గత నెల 23న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న వికాస్ ఫార్మసీ కళాశాల ఫార్మ్ డి ఫైనలియర్ విద్యార్థిని నాగాంజలి (23) ఆత్మహత్యాయత్నం తీవ్ర సంచలనం రేపింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మం డలం రౌతుగూడెం గ్రామానికి చెందిన నాగాంజలి రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి వద్ద వికాస్ ఫార్మసీ కళాశాలలో ఫార్మ్ డి పైనలియర్ చదువుతోంది. అయితే గత నెలలో నాగాంజలి ఆస్పత్రిలోనే ఎనస్థీషియా అత్యధిక డోస్ ఇంజక్షన్ తీసుకుంది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే గమనించిన సహచరులు ఐసీయూలోకి తరలించి చికిత్స అందజేశారు. ఈ క్రమంలో నాగాంజలి డైరీలో రాసుకున్న సూసైడ్ లెటర్ బయటకు రావడంతో తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థినిలు రాజమహేంద్రవరంలో ఆందోళనకు దిగారు.
Also Read: Gujarat: వారం క్రితమే నిశ్చితార్థం...ఇంతలోనే ప్రమాదం..కన్నీళ్లు పెట్టిస్తున్న గుజరాత్ జెట్ పైలెట్ మృతి!
ఆసుపత్రిలో మెడికల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న దీపక్ వేదింపుల వల్లే నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు సూసైడ్ నోట్‌లో రాసింది. అంతే కాకుండా సూసైడ్ నోట్‌లో దీపక్ వల్ల తాను అనుభవించిన బాధలను వివరించింది. ఓ ఫంక్షన్‌కు రెడ్ శారీ కట్టుకుని వెళ్లడంతో వాడి కళ్లలో పడ్డానని.. తనను మోసం చేశాడని, తనకు మరణం తప్ప వేరే దారి లేదని, తన గురించి బెంగపెట్టుకోవద్దని, తాను మరణించాక అవయవాలు దానం చేయాలి అంటూ ఫార్మాసిస్ట్ సూసైడ్ నోట్ రాసిమరీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు దీపక్ ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నాగాంజలి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read: Trump: ట్రంప్ నిర్ణయాలు.. భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం..!
Also Read: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
student | suicide | rajamahendravaram | east-godavari | westgodavari | crime | ap | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates