/rtv/media/media_files/2025/02/17/DXWnc7NZBMGc0X7GxTcw.jpg)
తమ కూతురితో నిత్యం గొడవలు పెట్టుకుంటున్నాడన్న కోపంతో పుట్టింటివారు ఏకంగా అల్లుడిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటన రెండు వారాల కిందటే జరగగా.. గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దంతెలబోర ఎస్సీ కాలనీకి చెందిన బల్లెం గౌతమ్ (24) బీటెక్ పూర్తి చేశాడు. టేకులపల్లి మండలం రామచంద్రునిపేటకు చెందిన ఎజ్జు కావ్యను మూడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి రెండేళ్లు, మూడు నెలల వయసున్న ఇద్దరు ఆడపిల్లలన్నారు. పెళ్లా్య్యాక గౌతమ్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ భార్యాబిడ్డలను పోషించుకుంటున్నాడు. కొన్ని రోజులు బాగానే సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. ఐదు నెలలుగా భర్తతో గొడవలు జరుగుతుండడంతో కావ్య తన పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
అర్ధరాత్రి 12 గంటల సమయంలో
అయితే 2025 ఫిబ్రవరి 02వతేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో గౌతమ్ తన అత్తింటికి వెళ్లి మాట్లాడాలంటూ భార్య కావ్యను బయటకు పిలిచాడు. ఇంట్లోంచి బయటకు వచ్చిన అత్త అనూరాధ, మామ వెంకటేశ్వర్లు, వారి కుమారులు సతీశ్, కార్తీక్‌లు గౌతమ్‌తో గొడవకు దిగారు. గొడవ కాస్త పెద్దది కావడంతో ఆగ్రహంతో గౌతమ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో చిక్కుకున్న గౌతమ్ వెంటనే పక్కనున్న నీటి తొట్టెలోకి దూకాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గౌతమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే గౌతమ్ ను ముందుగా ఖమ్మం ఆసుపత్రికి, ఆ తర్వాత వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న గౌతమ్ ఆదివారం రోజున తుదిశ్వాస విడిచాడు. మృతుడి తండ్రి బల్లెం చిన్న వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో ఫిబ్రవరి 11న కేసు నమోదు చేశామని, విచారణ చేపట్టామని ఎస్సై వెల్లడించారు.
Also Read : ఛీ ఛీ.. మీరు అన్నయ్యలేనారా.. వద్దు వద్దు అని వేడుకున్నా చెల్లిని వదల్లేదు కదరా!