Girls Hostel: గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ ఇష్యూ.. వెలుగులోకి సంచలనాలు!

మహబూబ్‌నగర్ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ బాత్రూమ్ వీడియో కేసులో సంచలనాలు బయటపడ్డాయి. నిందితుడు సిద్ధార్థ బ్యాక్ లాగ్స్ ఎగ్జామ్స్ రాసేందుకు వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధార్థకు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. 

New Update
girls hostel

Paul Technic College Girls hostel

Girls Hostel: మహబూబ్‌నగర్ పాలిటెక్నిక్ కాలేజీ అమ్మాయిల టాయిలెట్‌ మొబైల్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గర్ల్స్ టాయిలెట్‌లో మొబైల్ ఫోన్‌తో వీడియో ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడు సిద్ధార్థను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై 77,79 BNS, 66-E, 67 ITA-2000-2008 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. దీంతో సిద్దార్థకు 14రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం.  

పరీక్షకు వెళ్ళేముందు వీడియో రికార్డ్..

ఈ క్రమంలోనే సిద్ధార్థ మొబైల్‌ను FSLకు పంపించేందుకు పోలీసులు కార్యచరన మొదలుపెట్టారు. సిద్ధార్థ ఫోన్‌లో ఆరుగురి అమ్మాయిల వీడియోలు గుర్తించారు. బ్యాక్ లాగ్స్ ఉండడంతో పరీక్షలు రాసేందుకు కాలేజీకి వచ్చిన సిద్దార్థ పరీక్షకు వెళ్ళేముందు గర్ల్స్ టాయిలెట్‌లో మొబైల్‌లో వీడియో రికార్డు ఆన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధార్థ సొంతూరు పెద్దపల్లి జిల్లా మంథనిగా నిర్ధారించారు. 

ఇది కూడా చదవండి: క్లింకార ఫొటోను ఆరోజే రివీల్ చేస్తా.. బాలయ్య, చరణ్ 'అన్ స్టాపబుల్' ప్రోమో అదిరింది

అసలేం జరిగిందంటే..

మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్‌లో వీడియో రికార్డింగ్‌లు కలకలం రేపాయి. హాస్టల్ బాత్‌రూం వద్ద  ఈ యువకుడు మొబైల్ ద్వారా వీడియో రికార్డ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపణలు చేయడంతో పోలీసులు నవీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇక విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్నాయి.

ఇది కూడా చూడండి: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ఇలాంటిదే మరో ఘటన

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ కాలేజీపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని ఇటీవల స్టూడెంట్స్ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై అధికారుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. హాస్టల్ నిర్వహణ సరిగా లేదని గుర్తించినట్లు తెలుస్తోంది. సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Union Minister Grand Daughter Shot Dead : బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

కేంద్ర మంత్రి జితన్​ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి బుధవారం హత్యకు గురయ్యారు. ఆమెను భర్త రమేశ్ సింగ్​ కాల్చి చంపాడు. బిహార్​లోని​ గయా జిల్లా టెటువా గ్రామం అటారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

New Update
Union Minister Grand Daughter Shot Dead

Union Minister Grand Daughter Shot Dead

Union Minister Grand Daughter Shot Dead: కేంద్ర మంత్రి జితన్​ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి (32) బుధవారం హత్యకు గురయ్యారు. ఆమెను తన భర్త రమేశ్ సింగ్​ కాల్చి చంపాడు. బిహార్​లోని​ గయా జిల్లా టెటువా గ్రామం అటారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న అటారీ పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందింతుడు రమేశ్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

పోలీసుల కథనం ప్రకారం, మృతురాలు సుష్మా దేవి అటారీ బ్లాక్‌లో వికాస్ మిత్రాగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆమెపై రమేశ్ కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆమెను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి బంధించాడు. ఆ తర్వాత ఆమె ఛాతి భాగంలో కాల్చి పారిపోయాడు. దీంతో సుష్మా అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మగధ్ ఆసుపత్రికి తరలించారు. 'సుష్మను ఆమె భర్తే కాల్చి చంపాడు. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాం. ఫోరెన్సిక్ టీమ్​, టెక్నికల్ సెల్​ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నాం. నిందితుడిని వీలైనంత త్వరలోనే పట్టుకుంటాం' అని గయా ఎస్​ఎస్​పీ ఆనంద్ కుమార్ తెలిపారు.

Also Read: Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ (వీడియో చూశారా)

కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనుమరాలు 32 ఏళ్ల సుష్మా దేవి 14 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని ప్రేమించారు. అతడి పేరే రమేష్. వీరిద్దరూ గతంలోనే కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం బిహార్‌లోని గయా జిల్లా టెటువా గ్రామంలో ఉంటున్నారు. రమేష్ ఓ ట్రక్కు నడుపుతూ జీవనం సాగిస్తుండగా.. సుష్మాదేవి వికాస్ మిత్రగా పని చేస్తున్నారు. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. చాలా ఏళ్లుగా హాయిగా సాగుతున్న వీరి కాపురంలో ఇటీవలే గొడవలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది.  

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

అయితే ఎప్పటిలాగే వీరిద్దరూ బుధవారం రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంట్లోనే గొడవ పడ్డారు. అయితే అప్పుడు ఇంట్లో వీరి పిల్లలతో పాటు సుష్మాదేవి సోదరి కూడా ఉంది. కానీ భార్యాభర్తలు ఇద్దరు ఓ గదిలో ఉండగా.. వారంతా మరో గదిలో ఉన్నారు. ఏ విషయం గురించి వీరు గొడవ పడ్డారో తెలియదు కానీ రమేష్ ఒక్కసారిగా తుపాకీ తీసుకుని సుష్మాదేవిపై కాల్పులు జరిపాడు. ఫలితంగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో రమేష్ సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. తుపాకీ చప్పుడు వినిపించగా.. పిల్లలు, సోదరి సహా స్థానిక ప్రజలంతా అక్కడకు వచ్చారు. అయితే అప్పటికే సుష్మా దేవి ప్రాణాలు కోల్పోయి రక్తపు మడుగులో పడి ఉంది.

Also read :  Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి పక్కనే దేశీయ పిస్తోల్ దొరికింది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సుష్మా దేవి భర్త రమేష్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కేంద్రమంత్రి మనవరాలు కావడం, అదికూడా ఇంట్లో భర్త చేతిలోనే హత్యకు గురికావడంతో పోలీసులు కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈక్రమంలోనే నీమ్‌చక్ బథాని ఎస్డీపీఓ ప్రకాష్ కుమార్, ఎస్ఎస్పీ అన్వర్ జావేద్ అన్సారీ నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాట్లు చేసినట్లు గయా ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

Also Read :  ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!

Advertisment
Advertisment
Advertisment