డిజిటల్ అరెస్టు పేరుతో ముంబై మహిళకి టోకరా.. రూ.20.25 కోట్లు కాజేసిన కిలాడీలు

డిజిటల్ అరెస్టు పేరుతో ఓ వృద్ధురాలి దగ్గర రూ.20.25 కోట్లు కాజేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యిందని ఆమెను డిజిటల్ అరెస్టు చేసి రూ.20.25 కోట్లు కొట్టేశారు. తర్వాత మోసపోయినట్లు గుర్తించిన ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది.

New Update
Cyber Crime

Cyber Crime

ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. వీటి వలలో పడవద్దని పోలీసులు, అధికారులు చెబుతున్నా కూడా చాలా మంది పోగోట్టుకుంటున్నారు. తాజాగా ముంబైలో ఓ వృద్ధురాలు ఈ సైబర్ మోసాలకు చిక్కుకుంది. డిజిటల్ అరెస్టు పేరుతో ఆమె దగ్గర కోట్ల రూపాయలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో ఓ వృద్ధురాలను(86) బురిడీ కొట్టించి దుండగులు ఏకంగా రూ.20.25 కోట్లు కొట్టేశారు. పోలీసు అధికారులమని చెబుతూ.. వృద్ధురాలికి టోకరా వేశారు.

ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యిందని..

ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యిందని, దాని సాయంతో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని బెదిరించారు. మీరు నేరానికి పాల్పడినట్లు ఒప్పుకోకపోతే మాత్రం మీ కుటుంబాన్ని మొత్తం కేసులో చేర్చుతామని దుండగులు బెదిరించారు. ఇలా ఆమెను డిజిటల్ అరెస్టు చేసి రూ.20.25 కోట్లు కొట్టేశారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన ఆ వృద్ధురాలు పోలీసులుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది

ఇదిలా ఉండగా రివర్స్ సైబర్ నేరగాడి నుంచే డబ్బులు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పూర్‌కు చెందిన భూపేంద్రసింగ్‌‌కు ఒక కాల్ వచ్చింది. అందులో ఒక సైబర్ కేటుగాడు.. తనను తాను సీబీఐ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడు. భూపేంద్ర సింగ్‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు తన దగ్గర ఉన్నాయని అతడిని భయపెట్టాడు. ఈ కేసును క్లోజ్ చేయాలంటే తనకు రూ.16వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఈ తరహా సైబర్ స్కామర్ల కాల్స్‌పై అవగాహన కలిగి ఉన్న భూపేంద్ర ముందుగానే జాగ్రత్త పడ్డాడు. 

ఇది కూడా చూడండి: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

తాను గతంలో ఒక బంగారం చైన్ తాకట్టు పెట్టానని.. అయితే అది విడిపించడానికి రూ.3000 కావాలని ఆ స్కామర్‌నే తిరిగి అడిగాడు. ఆ చైన్ విడిపిచి ఎంత కావాలంటే అంత ఇస్తానని నమ్మించాడు. భూపేంద్ర మాటలు నమ్మిన ఆ కేటుగాడు తొలుగు రూ.3వేలు ట్రాన్సఫర్ చేశాడు. ఇలా మొత్తం రూ.10 సైబర్ నేరగాడి నుంచి తీసుకుని మళ్లీ ఈ డబ్బును డొనేట్ చేశాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు