Nagarkurnool : భార్యాభర్తలు కాదని గ్యాంగ్ రేప్.. సంచలన విషయాలు బయటపెట్టిన ఐజీ!

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేట గ్రామ శివారులోని ఆంజనేయస్వామి దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన విషయాలను ఐజీ సత్యనారాయణ బయటపెట్టారు.

New Update
gang-rape-on-women

gang-rape-on-women

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేట గ్రామ శివారులోని ఆంజనేయస్వామి దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆలయానికి వచ్చింది భార్యభర్తలు కాదని తెలుసుకున్న దుండగులు పక్కా ప్లాన్ తో  వివాహితను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారని మల్టీజోన్‌-2 ఐజీ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. బాధితురాలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ప్రదేశాన్ని ఆయన మంగళవారం జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌తో కలిసి పరిశీలించారు.  

ఒంటరిగా బహిర్భూమికి వెళ్లిన సమయంలో

ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ రాత్రి పది గంటల సమయంలో ఓ జంట ఆలయానికి రావడాన్ని నలుగురు నిందితులు గమనించారని మరో ముగ్గురికి ఫోన్ చేసి పిలిపించుకున్నారు.  మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివాహిత ఒంటరిగా బహిర్భూమికి వెళ్లిన సమయంలో గ్యాంగ్‌రేప్‌ జరిగింది. మహిళ ఎంతకూ రాకపోవడంతో వెతకడానికి వెళ్లిన ఆమెతో వచ్చిన వ్యక్తిని తాళ్లతో కట్టేశారు. అనంతరం బాధితురాలు తేరుకుని, ఆమెతో వచ్చిన వ్యక్తి కట్లు విప్పింది. అనంతరం బాధితురాలు తన ఇంటికి వెళ్తుండగా..  నిందితుల్లో ఒకరైన మహేశ్‌గౌడ్ గమనించి ఈ విషయం ఎవరికైనా చెబితే  మీ వ్యవహారం బయట పెడతామని బెదిరించాడు. దీంతో బాధితురాలు తన  ఆభరణాలు, డబ్బు చోరీ చేశారంటూ ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సీసీ కెమెరాలను పరిశీలించి

ఆలయానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు  మహేశ్‌గౌడ్‌ బాధితురాలిని బెదిరించడాన్ని కనిపించింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఊర్కొండపేటకు చెందిన సాధిక్‌బాబా, హరీశ్‌గౌడ్, మణికంఠగౌడ్, మారుపాకుల ఆంజనేయులుగౌడ్, మట్ట ఆంజనేయులుగౌడ్, కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన కార్తిక్‌ బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.  

Also Read : German woman: జర్మనీ యువతి రేప్ కేసు.. పోలీసులకు దొరికిన నిందితుడు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Uttar Pradesh: ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. గజగజ వణికిపోయిన వరుడు!

ఉత్తరప్రదేశ్‌లో ఓ వరుడికి మొదటి రాత్రే వధువు షాక్ ఇచ్చింది. శోభనం రాత్రి నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని వరుడికి బెదిరించింది. ఎంత నచ్చజెప్పినా కూడా వధువు వినిపించుకోలేదు. దీంతో వరుడు పోలీసులను ఆశ్రయించాడు.

New Update
Marriage

Uttar pradesh

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. పెళ్లి జరిగి కనీసం ఒక రోజు కాకుండానే భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఎంతో పవిత్రమైన పెళ్లిని పెటాకులు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి యువతితో పెళ్లి జరిగింది.

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

పెళ్లికి ముందే ఓ అబ్బాయిని..

కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఘనంగా పెళ్లి చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. దీంతో మొదటి రాత్రే వధువు చేసిన పనికి వరుడు గజ గజ వణికి పోయాడు. శోభనం గదిలో వధువు వరుడికి ఓ వింత కండీషన్ పెట్టింది. నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని బెదిరించింది. వరుడు ఎంత నచ్చజెప్పిన కూడా వధువు వినిపించు కోలేదు. టచ్ చేయవద్దని బెదిరించింది. 

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

చివరకు వరుడు అడగ్గా.. పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించానని ఇప్పటికీ కూడా అతన్నే ప్రేమిస్తున్నానని, తనే నా భర్త అని తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ అయి కుటుంబ సభ్యులకు తెలిపాడు. అయితే ఆ వధువు ఏ మాత్రం కూడా వినకపోయే సరికి వరుడు పోలీసులను ఆశ్రయించాడు. వధువుతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

 

marriage | uttar-pradesh | national news in Telugu | today-news-in-telugu | latest-telugu-news | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment