/rtv/media/media_files/2025/04/06/sIg1oSodKJpkLHpASwBD.jpg)
women died husband
దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఓ యువతి రోలర్ కోస్టర్ ప్రమాదంలో మరణించింది. ఇంతకు ఏం జరిగిదంటే.. 24 ఏళ్ల ప్రియాంకకు నిఖిల్ అనే వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు. జనవరిలో వీరి ఎంగేజ్ మెంట్ కూడా అయింది. మరికొన్ని నెలల్లో వారికి పెళ్లి జరిగాల్సి ఉంది. అయితే ఇద్దరు కలిసి నైరుతి ఢిల్లీలోని కపాషెరా సమీపంలోని వాటర్ అండ్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు వెళ్లింది.
Also read: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం
రోలర్ కోస్టర్ స్టాండు విరిగిపోయి
పాపం అక్కడే వారి జీవితం మలుపు తిరిగింది. అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఇద్దరు రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. బాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగిపోయింది. దీంతో, ప్రియాంక ఎత్తులో నుంచి కింద పడిపోయింది. దీంతో వెంటనే నిఖిల్ ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. అయితే అప్పటికే ప్రియాంక చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు. ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ఈఎన్‌టీ రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు అయినట్టు వైద్యులు వెల్లడించారు.
Also read : Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్ లల్లాకు సూర్య తిలకం
కాబోయే భార్యతో లైఫ్ లాంగ్ ఉండాలని ఎన్నో కలలు కన్న నిఖిల్.. ప్రియాంక తన కళ్లముందే చనిపోవడం చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రియాంక మృతి ఘటన ఇరు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిందనే చెప్పాలి. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ప్రమాదంపై అమ్యూజ్‌మెంట్ పార్క్ ఇంకా ఎలాంటి ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
Also read : Watch Video: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్