Hyderabad: మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో దారుణం.. యువతిపై అత్యాచారానికి యత్నించి..

మేడ్చల్ రైల్వే స్టేషన్ లో దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ యువతిపై అత్యాచారానికి యత్నించారు. అదృష్టవశాత్తు యువతి వారిని రాయితో కొట్టి తప్పించుకుంది. అనంతరం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

New Update

Hyderabad: రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఒక  మరవకముందే మరొకటి ప్రజల్లో ఆందోళనను కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్ మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో యువతి పై అత్యాచార యత్నం కలకలం రేపుతోంది. మేడ్చల్ రైల్వే స్టేషన్ లో కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఓ యువతి పై అత్యాచారానికి యత్నించారు. అదృష్టవశాత్తు ఆమె ఆ దుండగులను రాయితో కొట్టి అక్కడి నుంచి తప్పించుకుపోయింది. అనంతరం సమీపంలో ఉన్న మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని స్పాట్ ని పరిశీలించి.. ఆధారాలు సేకరించారు.  ఆ తర్వాత కేసును రైల్వే పోలీసులకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. 

ఇది కూడా చూడండి: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

ఇటీవలే కర్ణాటక రైల్వే స్టేషన్ లో 

ఇదిలా ఉంటే ఇటీవలే కర్ణాటకలో కెఆర్ పురం రైల్వే స్టేషన్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. మామ కొడుకుతో కలిసి స్టేషన్‌కు వచ్చిన అమ్మాయిపై ఇద్దరు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇద్దరినీ ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి బాధితురాలితో వచ్చిన యువకుడిని ఒక వ్యక్తి అదిమిపట్టుకోగా మరో వ్యక్తి యువతిని రేప్ చేయడం కలకలం రేపింది. స్థానికులు నిందితులలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలో పనిచేస్తున్న ఆ యువతి బీహార్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితులు ఆసిఫ్, సయ్యద్ ముషార్ కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ముల్బాగిలు నివాసితులగా గుర్తించారు. అంతేకాదు నిందితుడు ఆసిఫ్ పై ఇప్పటికే అత్యాచారం ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

telugu-news | latest-news | crime | medchal హైదరాబాద్ 

Also Read: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment