Crime News: తెలంగాణలో మరో దారుణం.. బాలికపై యువకుల అత్యాచారం!

తెలంగాణలో మరో దారుణం జరిగింది. మెదక్‌ జిల్లా చేగుంటలో 16 ఏళ్ల బాలికపై లకావత్‌ ప్రవీణ్‌, రాజు అనే యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అమ్మాయిని చికిత్స కోసం మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై చైతన్యరెడ్డి తెలిపారు. 

New Update
UP Crime : పంచాయతీ పెద్దల అరాచకం.. వివాహితను చెట్టుకు కట్టేసి.. చెప్పుల దండ మెడలో వేసి!

16 years old Girl sexually assaulted

Crime News: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో బాలిక బలైంది. ఆమె తల్లిదండ్రులు అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా ఇంటి వద్దే ఉన్న చిన్నారిపై ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న అమ్మాయిపై లైంగిక దాడి చేశారు. ఒకరి తర్వాత ఒకరు విచక్షణ రహితంగా కాంమవాంఛ తీర్చుకోగా చివరికి బాలిక అరుపులతో స్థానికలు నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకోగా ఎస్సై చైతన్యరెడ్డి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఒంటరిగా ఉండటం గమనించి.. 

ఈ మేరకు బాధితురాలైన బాలిక (16) తల్లిదండ్రులు మరమరాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తారు. ఈ క్రమంలోనే వర్గల్‌ మండలంలోని అనంతగిరిపల్లికి శుక్రవారం వెళ్లారు. అయితే అక్కడే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో బాలిక చిన్నాన్న, అన్న కలిసి వారిని తూప్రాన్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి సికింద్రాబాద్‌ గాంధీకి తరలించారు. అయితే వారిని చూసేందుకు వెళ్లిన బాలిక చిన్నమ్మను అదే గ్రామానికి చెందిన లకావత్‌ ప్రవీణ్‌ బైక్ పై గాంధీ ఆసుపత్రిలో దింపి వచ్చాడు. ఈ క్రమంలోనే బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఉండటం గమనించాడు. సాయంత్రం వరకు ఆమెను ఫాలో అయిన ప్రవీణ్.. మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లికి చెందిన రాజును పిలుచుకున్నాడు. అదే రాత్రి గుడిసెలో నిద్రపోతున్న ఆమెపై అగాయిత్యానికి పాల్పడ్డారు.

ఇది కూడా చదవండి: Pawan; సినిమా ఇండస్ట్రీకి పవన్ కీలక సూచన.. సంచలన లేఖ విడుదల!

అయితే అర్ధరాత్రి బాలిక అరుపులు విన్న చిన్నాన్న గుడిసె తలుపు తీసేందుకు ప్రయత్నించగా రాలేదు. దీంతో ఇరుగుపొరుగును పిలిచి తలుపులు తెరవగా అసలు విషయం బయటపడింది. నిందితులను పట్టుకుని దేహశుద్ది చేసి చేగుంట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి బాలికను చికిత్స కోసం మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తన్నామని ఎస్సై చైతన్యరెడ్డి చెప్పారు. 

ఇది కూడా చదవండి: BCCI: రోహిత్‌కు బీసీసీఐ బిగ్ షాక్.. హింట్ ఇచ్చేసిన సెలెక్టర్లు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment