Crime : ఏమైంది.. ఉరేసుకొని వివాహిత, యువతి ఆత్మహత్య!

ఓ వివాహిత, యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి. చేవెళ్ల హౌసింగ్‌ బోర్డు కాలనీలో వివాహిత యమున(30) ఆత్మహత్యకు పాల్పడగా.. విజయవాడలో బల్లం శరణ్య(19)అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.

New Update
suicide two girls

suicide two girls

ఓ వివాహిత, యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి.  కుటుంబసభ్యుల వెల్లడించిన వివరాల ప్రకారం.. చేవెళ్ల హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఉండే  గోవిందగారి పురుషోత్తంరెడ్డికి, కాళీమందిర్‌కు చెందిన తరుణి అలియాస్‌ యమున(30)తో రెండేళ్ల కిత్రం పెళ్లి జరిగింది. ఎంతో అన్యోన్యంగా వీరు కాపురం ఉంటున్నారు.  అయితే శనివారం రాత్రి భర్త ఇంట్లో లేని టైమ్ చూసి గడియ పెట్టుకొని ఉరి వేసుకొని యమున ఆత్మహత్యకు పాల్పడింది.  దీంతో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. యుమున ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందో కారణాలు తెలియాల్సి ఉంది. 

Also Read: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?

మరో యువతి ఆత్మహత్య

ఇక విజయవాడలో మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల వెల్లడించిన వివరాల ప్రకారం..  క్రీస్తురాజపురం ఫిల్మ్‌ కాలనీకి చెందిన మచ్చా సరస్వతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుండగా.. ఆమె భర్త చైతన్య ఆయుర్వేద వైద్యుడుగా పనిచేస్తున్నాడు.  వీరికి ఒక పాప, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. అయితే ఇంటిని, చిన్న పిల్లలను చూసుకోవడానికి సరస్వతి తన అక్క కుమార్తె అయిన బల్లం శరణ్య(19)ను తీసుకువచ్చింది. ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి వచ్చిన సరస్వతి ఇంటికి వచ్చి చూసేసరికి శరణ్య ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. 

ఇది కూడా చూడండి: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా..  అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే  శరణ్య ఉరివేసుకుని చనిపోలేదని, ఆమెను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

Also read :  MLA Raja Singh : ఒవైసీ బ్రదర్స్‌ను కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్


 

Advertisment
Advertisment
Advertisment