/rtv/media/media_files/2025/02/09/Ar2Xv4DEDMZ42Z84A9lV.jpg)
Sangareddy crime
Maharashtra: ఈ మధ్య హంతకులు క్రైమ్ చేయడానికి వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఏకంగా క్రైమ్ థిల్లర్ సినిమాలు చూసి హత్యలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ఓ ప్రాంతంలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. సీరియల్ కిల్లర్ మూవీ చూసి 13 ఏళ్ల బాలుడు ఆరేళ్ళ బాలికను క్రూరంగా చంపాడు.
Also Read: Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!
సినిమా చూసి.. దారుణ హత్య
మహారాష్ట్ర పాలఘర్ జిల్లాలో 13 ఏళ్ళ బాలుడు తన బంధువైన ఆరేళ్ళ బాలికను కుటుంబ సభ్యులంతా ముద్దు చేయడం తట్టులేకపోయాడు. అసూయతో దారుణానికి ఒడిగట్టాడు. బాలికను గొంతుకోసి బండరాయితో మొహాన్ని చిదిమేసి క్రూరంగా హత్య చేశాడు. అయితే శనివారం సాయంత్రం బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఒక కంపెనీ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలో బాలుడు బాలికను ఎక్కడికో తీసుకెళ్లినట్లు కనిపించింది. దీంతో అసలు విషయం బయటపడింది. సీరియల్ కిల్లర్ నేపథ్యంతో రూపొందిన హిందీ చిత్రం 'రామన్ రాఘవ్' నుంచి ప్రేరణ పొంది బాలుడు బాలికను హత్య చేసినట్లు అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Also Read: Oscar Awards 2025: ప్రియాంక చోప్రాకు ఆస్కార్ జస్ట్ మిస్.. 'అనుజ' ను బీట్ చేసిన డచ్ ఫిల్మ్!
Also Read: Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!