/rtv/media/media_files/2025/02/21/JlDWK4Dwlu1h36zIuFzn.jpg)
Accident
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం మహా కుంభమేళా జరుగుతోంది. పుణ్య స్నానాలు ఆచరించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో సంగారెడ్డి వాసులు ముగ్గురు దుర్మరణం చెందారు.
ఇది కూడా చూడండి: Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మృతులను సంగారెడ్డి వాసులుగా..
వారణాసిలో ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న టిప్పర్ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మృతులను సంగారెడ్డి వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన ముగ్గురు జహీరాబాద్ నీటి పారుదల శాఖ డీఈ వెంకటరామిరెడ్డి (46), ఆయన భార్య విలాసిని (40), మల్గికి చెందిన కారు డ్రైవర్ మల్లారెడ్డి (42) అని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!
ఇదిలా ఉండగా సంగారెడ్డి జిల్లా వాసులు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స, తక్షణ సహాయక చర్యలను అందించాలని తెలిపారు. దీని కోసం వెంటనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చూడండి: Allu Arjun: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!
ఇది కూడా చూడండి: Raja Saab Latest Updates: రాజాసాబ్ కోసం స్టార్ కమెడియన్స్.. ఈసారి థియేటర్స్ దద్దరిల్లాలి