/rtv/media/media_files/2025/02/17/haqRSrQD0Hb3EJxKFKSl.jpg)
Crime
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్రైమ్ షోలు చేసి ఓ భర్త తన భార్యను దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా స్టోరీ మలిచాడు. కానీ చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ భర్త భార్యను దారుణంగా చంపాడు. వరకట్నం కోసం ఆమెను కుటుంబ సభ్యులు వేధించారు. ఈ క్రమంలో ఆమెను తీవ్రంగా కొట్టి చంపారు.
ఇది కూడా చూడండి: Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!
చంపాలని ముందుగానే ప్లాన్ చేసి..
భర్త ఈమెను చంపడానికి ముందు క్రైమ్ షఓలు చూసి, ఎలా చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఆమెను చంపి రోడ్డుపై మృతదేహాన్ని వేసి యాక్సిడెంట్‌గా క్రియేట్ చేయాలనుకున్నాడు. కానీ సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు భర్తే చంపినట్లు గుర్తించారు. అయితే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మర్డర్‌లో ఇంకా కుటుంబ సభ్యుల పాత్ర ఎవరిదైనా ఉందా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!
హైదరాబాద్‌లో మరో అక్రమ సంబంధం మర్డర్ సంచలనంగా మారింది. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న భార్య తనను మోసం చేసిందనే కోపంతో ఓ భర్త ఆ ఇళ్లాలిని సజీవదహనం చేశాడు. అర్ధరాత్రి నిద్రలో ఉండగా గుట్టుచప్పుడు కాకుండా ఆమెను లేపేశాడు. ఆ తర్వాత ఆమె సూసైడ్ చేసుకున్నట్లు నమ్మించేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ దారుణం అంబర్ పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చూడండి: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది
ఈ మేరకు ఇన్‌స్పెక్టర్ డి.అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్ పేట పటేల్ నగర్ బిలాల్ మజీదు బస్తీకి చెందిన నవీన్ (32), రేఖ (28)కు 6 ఏళ్ల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. వీరికి కొడుకు (5), కూతురు (3) ఇద్దరు పిల్లలున్నారు. అయితే నవీన్ తన ఇంటికి దగ్గరలో ఓ కిరాణం షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆమె మరో పురుషుడితో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానించిన భర్త తాగుడుకు బానిసయ్యాడు. అనుక్షణం అనుమానిస్తూ వేధిస్తూ ఉండేవాడు.చివరికి చంపేశాడు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!