కోల్‌కతాలో షాకింగ్ ఘటన.. మహిళల సూట్‌కేస్‌లో బాడీ పార్ట్స్

ఇద్దరు మహిళలు సూట్ కేస్‌లో బాడీ పార్ట్స్ తీసుకెళ్లి హుగ్లీ నదిలో పడేయడానికి ప్రయత్నించారు. అనుమానస్పదంగా కనిపించడంతో స్థానికులు వారిని ప్రశ్నించగా శునకం అవశేషాలు ఉన్నాయన్నారు. బలవంతంగా స్థానికులు సూట్‌కేస్‌ను ఓపెన్ చేయడంతో విషంయ వెలుగులోకి వచ్చింది.

New Update
Kolkata Suit case

Kolkata Suit case Photograph: (Kolkata Suit case)

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల సూట్‌కేసులో మానవుల బాడీ పార్ట్స్‌ను పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరు మహిళలు హుగ్లీ నదిలో ఆ సూట్‌కేసును విసిరేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వీరిని పట్టుకున్నారు. అహిరిటోలా ఘాట్ ప్రాంతంలో వీరిద్దరూ మహిళలు అనుమానస్పదంగా కనిపించారు.

ఇది కూడా చూడండి: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

ఇది కూడా చూడండి: Breaking News : కాంగ్రెస్ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు!

స్థానికులకు అనుమానం రావడంతో..

దీంతో అక్కడున్న స్థానికులు ఆ ఇద్దరు మహిళలను అడ్డుకుని ప్రశ్నించారు. సూట్‌కేసులో శునకం అవశేషాలు ఉన్నాయని స్థానికులకు చెప్పారు. అనుమానం వచ్చిన స్థానికులు బలవంతంగా ఆ సూట్‌కేస్‌ను ఓపెన్ చేయగా.. మనిషి అవయవాలు కనిపించాయి. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారు వచ్చి ఆ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు మహిళలను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ బాడీ పార్ట్స్ ఎవరవని విచారిస్తున్నారు. బాడీ పార్ట్‌లను పోస్ట్ మార్టంకి పంపించి పరీక్షలు నిర్వహించారు.

ఇది కూడా చూడండి: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!

ఇది కూడా చూడండి: Viral Video: రోజులు మారాయ్.. మేము కూడా డాన్సర్లమే బాబూ - అర్చకుల బ్రేక్ డాన్స్‌తో కిక్కిరిసిపోయిన రోడ్లు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

తైవాన్‌కి చెందిన ఎన్వీ(57) అతని మాజీ ప్రియురాలిని బ్లాక్‌మెయిల్ చేయడానికి ఆమె తండ్రి అస్థికలు దొంగలించాడు. ఆమె మళ్లీ కలిస్తేనే అస్తికలు ఇస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో టాంగ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఎల్వీని అరెస్ట్ చేసి అస్థికలను ఆమెకి ఇచ్చేశారు.

New Update
Ashes

Ashes Photograph: (Ashes )

తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి వ్యక్తి ఓ ప్లాన్ వేశాడు. ఆమె తండ్రి అస్థికలు దొంగలించి బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ విషయంగా ఫిభ్రవరిలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తైవాన్‌కు చెందిన ఎల్వి(57) అనే వ్యక్తి అతని మాజీ ప్రియురాలి తండ్రి అస్థికలను దొంగిలించాడు. 15 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2023లో ఎల్వీ, టాంగ్(48) మధ్య లవ్ బ్రేక్‌అప్ అయ్యింది. గత కొన్ని నెలల క్రితం టాంగ్ తండ్రి చనిపోయారు. ఆమె తన తండ్రి అంత్యక్రియల తర్వాత అస్థికలను జాగ్రత్తగా భద్రపరిచింది. 2023మేలో ఎల్వీ వాటిని దొంగలించాడు. 2025 లవర్స్ డే రోజు ఎల్వీ.. టాంగ్‌కు ఆమె తండ్రి అస్థికలు ఉన్న కలశం ఫొటో పంపాడు. ఆమె తిరిగి అతన్ని కలవడానికి అంగీకరిస్తేనే ఆ అస్థికలు ఇస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఎల్వి 2023లో టాంగ్‌తో ఉన్న రిలేషన్‌ను కట్ చేసుకున్నాడు. 

Also read: Terrorists arrests: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

ఎల్వీకి ఆమెతో విడిపోవడం ఇష్టం లేదు. తరువాతి రెండేళ్లలో టాంగ్‌ను పదే పదే ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. మే 2023లో అతను టాంగ్ తండ్రి అస్థికలు ఉంచబడిన స్మశానవాటికను సందర్శించడం ప్రారంభించాడు. ఆమెను మానసికంగా ఒత్తిడి చేయడానికి ఆ కలశం దొంగిలించాలని అతను ప్లాన్ చేశాడు. టాంగ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు అస్థికలు ఉన్న కలశం కోసం వెతకడం ప్రారంభించారు. ఎల్వీ కోళ్ల ఫారంలో అస్థికలు ఉన్న కలశం లభించింది. మార్చి 28న పోలీసులు ఆ పాత్రను స్వాధీనం చేసుకుని శ్రీమతి టాంగ్‌కు తిరిగి ఇచ్చారు.  ఎల్వి ఇప్పటికే సంబంధం లేని చీటింగ్, మనీలాండరింగ్ ఆరోపణలపై జైలులో ఉన్నాడు. 

Also read: Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

Advertisment
Advertisment
Advertisment