/rtv/media/media_files/2024/12/15/nn7e9wDaCWqUcfXYoZSZ.jpg)
ప్రస్తుతం రోజుల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అతివేగం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజుకి ఎంత మంది ఈ ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారో లెక్క కూడా ఉండటం లేదు. మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసిన కూడా ఇతరులు స్పీడ్‌గా లేదా తాగి డైవ్ చేయడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరో ఒకరు చేసిన ప్రమాదం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రమాదాల్లో వారికి కావాల్సిన మనుషులు మరణించడంతో ఎందరో అనాథులు అవుతున్నారు.
ఇది కూడా చూడండి: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
#Kerala: #PathanamthittaAccident
— Surya Reddy (@jsuryareddy) December 15, 2024
Tragic, 4 members of a family, including a #NewlywedCouple, lost their lives, after their car collided with a bus carrying #Sabarimala pilgrims at #Murinjakal in #Koodal at #Pathanamthitta district in the early hours today.
The deceased… pic.twitter.com/B2g5n7kKcB
ఇది కూడా చూడండి: YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల
బస్సు ఢీకొట్టడంతో..
తాజాగా కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. మరణించిన నలుగురులో ఓ కొత్త జంట ఉంది. హనీమూన్ కోసం మలేషియా వెళ్లిన వీరు తిరిగి వచ్చారు.
ఇది కూడా చూడండి: మరికాసేపట్లో గ్రూప్ - 2 పరీక్ష.. ఈ తప్పు చేశారో ఇంటికే ఇక!
ఈ క్రమంలో వరుడు, వధువు తండ్రి వారిని పికప్ చేసుకోవడానికి తిరువనంతపురం ఎయిర్ పోర్ట్‌కు వెళ్లారు. ఇంటికి వెళ్తుండగా పతనంతిట్ట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఇంటికి ఇంకో 15 నిమిషాల్లో వెళ్లిపోతారనే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొట్టిన బస్సులో శబరిమల యాత్రికులు ఉన్నారు. వీరిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: Road Accident: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి!