/rtv/media/media_files/2025/02/23/5Omy0no9n6vPjZIcdvqk.jpg)
Kerala crime Photograph: (Kerala crime)
కేరళలో విషాద ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జీఎస్టీ విభాగంలో అదనపు కమిషనర్‌గా మనీష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇతనితో పాటు కుటుంబం మొత్తం అనుమానాస్పద స్థితిలో మరణించారు. జార్ఖండ్‌కు చెందిన మనీష్ కొచ్చిలో కస్టమ్స్ అధికారిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఎర్నాకుళంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే మనీష్ నాలుగు రోజులు సెలవులు తీసుకుని తిరిగి మళ్లీ విధుల్లోకి వెళ్లలేదు. దీంతో ఆయన తోటి ఉద్యోగులు ఇంటికి వెళ్లి చూడగా దుర్వాసన వస్తోంది.
ఇది కూడా చూడండి: Sridhar Babu: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!
#WATCH | Ernakulam, Kerala: Putta Vimaladitya, Commissioner Of Police, Kochi, says, " On 20th February, we found 3 bodies...in the customs quarters. A customs officer Manish Vijay, his sister and mother, were found dead inside the house. A case of unnatural death has been… https://t.co/fGMwrrsO7Z pic.twitter.com/uGGInyup7G
— ANI (@ANI) February 22, 2025
ఇది కూడా చూడండి: Almond Vs Coconut Oil: బాదం నూనె వర్సెస్ కొబ్బరి నూనె.. ఏది మంచిది?
తోటి ఉద్యోగి వెళ్లి చూడగా..
తలుపులు పగలుగొట్టి ఇంటి లోపలికి వెళ్లి చూడగా.. తల్లి, సోదరి, మనీష్ కూడా చనిపోయి కనిపించారు. తల్లి బెడ్‌పైన ఉండగా.. మనీష్, తన సోదరి ఉరి వేసుకుని కనిపించారు. తోటి ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వీరు ముగ్గురు ఒకేసారి చనిపోవడంతో ఎవరైనా హత్య చేశారా? లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Pope: పోప్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏమీ చెప్పలేమంటూ అధికారుల ప్రకటన!
మనీష్ ఇంటిని చెక్ చేస్తుండగా పోలీసులకు తన గదిలో ఓ లేఖ కనిపించింది. తమ సోదరి విదేశాల్లో ఉంటారని, ఆమెకు తమ చావు గురించి సమాచారం ఇవ్వాలని ఆ లేఖలో రాసి ఉంది. అయితే ఆమె విదేశాల నుంచి వచ్చిన తర్వాతే పోస్టుమార్టం చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: పదిరోజులకే పెళ్లి పెటాకులు.. హనీమూన్లో గొడవ.. చివరికి బిగ్ ట్విస్ట్!