/rtv/media/media_files/2025/02/21/doR4uv3dow0SypTF1UWX.jpg)
Karnataka Road accident Photograph: (Karnataka Road accident)
కర్ణాటకలోని కలబురగి జిల్లాలో కంటైనర్ లారీ డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో కంటైనర్ అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న కూరగాయల షాపులోకి చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూరగాయల వ్యాపారి మహ్మద్ అలీ అక్కడిక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకుని పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Puri Jagannadh Golimaar Sequel: పదిహేనేళ్ల తర్వాత పూరీ సినిమాకి సీక్వెల్.. ఈసారి కొడితే బ్లాక్ బస్టరే..!
A truck driver suffered a heart attack while driving, causing a series of accidents which resulted in the death of one person in Karnataka's Kalaburagi Wednesday night. pic.twitter.com/FYzKsTewUz
— The Brief (@thebriefworld) February 21, 2025
ఇది కూడా చూడండి: Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!
నెలల పసికందు..
ఇదిలా ఉండగా ఇటీవల హైదరాబాద్‌లో ఓ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో తండ్రితో పాటు 5 నెలల కుమారుడు కూడా మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సాయి కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన తల్లి, తండ్రి, భార్య, 5 నెలల కుమారుడితో హైదరాబాద్ నుంచి సొంత పట్టణం అయిన సూర్యాపేటకు బయల్దేరారు. కొంత వరకు వారి ప్రయాణం సాఫీగా సాగిపోయింది. కానీ ఇంతలోనే ఘోర ప్రమాదం జరిగింది.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్ గా ముందుకు దూసుకుపోండి!
ఈ ప్రమాదంలో సాయి కుమార్, 5 నెలల కుమారుడు మృతి చెందారు. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం చెరువు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఒక కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది. అనంతరం సాయి కుమార్ ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు.