/rtv/media/media_files/2025/01/14/8TXWZKjyIfROEDRD8jcc.jpg)
Gold Photograph: (Gold )
కర్ణాటకలో ఓ వ్యక్తి ఏకంగా బ్యాంకుకే కన్నం వేశాడు. మనీ హీస్ట్ సిరీస్ చూసి.. కోట్ల విలువ చేసే బంగారాన్ని దోపిడీ చేశాడు. గతేడాది జరిగిన ఈ కేసును తాజాగా పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే.. 2024 అక్టోబర్ 28న న్యామతి ఎస్‌బీఐ బ్యాంకు సిబ్బంది లోపలికి వచ్చే సరికి స్ట్రాంగ్ రూమ్ లాకర్లలో ఒకటి గ్యాస్ కట్టర్లతో కట్ చేసి ఉంది. అందులో తాకట్టు పెట్టిన బంగారాన్ని దుండగులు దొంగతనం చేశారు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్‌ను మాయం చేశారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
ఎలాంటి ఆధారాలు లేకుండా ఉండేందుకు..
అలాగే ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్వ్కాడ్‌కు ఎలాంటి క్యూలు కూడా ఉండకూడదని బ్యాంక్‌లో కారం చల్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో ఇలాంటి దొంగతనాలే ఏ బ్యాంకులో అయినా జరిగాయా అని దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో గుడ్డు కాలియా, అస్లాం అలియాస్ తంతున్, హజరత్ అలీ, కమ్రుద్దీన్ అలియాస్ సరైల్లీ బాబు, బాబు సహాన్‌లను అరెస్టు చేశారు. అయితే న్యామతి ఎస్‌బీఐ దొంగతనంలో వీరికి సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేకపోవడంతో దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చింది.
ఇది కూడా చూడండి: Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
ఆ తర్వాత మళ్లీ తమిళనాడుకి చెందిన వారితో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో విజయ్ కుమార్, అజయ్‌కుమార్, అభిషేక, చంద్రు, మంజునాథ్, పరమానందలను పోలీసుల అరెస్టు చేసి విచారించారు. మనీ హీస్ట్ చూసి ఈ భారీ దోపిడీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. తమిళనాడుకి చెందిన వీరు కొన్నేళ్ల నుంచి న్యామతిలో స్వీట్స్ వ్యాపారం చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Ap Weather Alert: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
దొంగతనం చేయడానికి ఆరు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకున్నట్లు విచారణలో తేలింది. విజయ్ కుమార్‌కి రూ.15 లక్షల లోన్ ఉండటంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. శబ్ధం లేకుండా పనిచేసే హైడ్రాలిక్ కట్టర్లు, గ్యాస్ కటింగ్ పరికరాలను సేకరించారు. అయితే దొంగతనం చేసిన బంగారాన్ని 30 అడుగుల బావిలో దాచి ఉంచారు. ఆ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చూడండి: IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్