Mamatha: కరీంనగర్ మమత కేసు ఛేదించిన పోలీసులు.. ప్రియుడి కుటుంబమే!

కరీంనగర్‌ జిల్లా బెల్లంపల్లికి చెందిన వివాహిత మమత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు అక్రమ సంబంధమే కారణమని వెల్లడించారు. భర్త ఉండగానే ప్రియుడు భాస్కర్‌ను మోసం చేస్తుందనే కోపంతో భాస్కర్ కుటుంబమే హతమార్చినట్లు తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు.

New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

Karimnagar Mamata murder case police solved

Mamatha murder case: కరీంనగర్‌ జిల్లాలో జరిగిన వివాహిత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. బెల్లంపల్లికి చెందిన మమత హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు వెల్లడించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు జనవరి 27న చంపి గంగాధర మండలం కొండన్నపల్లి దగ్గర డెడ్ బాడీ పడేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసు దర్యాప్తు వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై లాడ్జిలో దొరికిన కొడుకు..

బెల్లంపల్లి కాసిపేటకు చెందిన మమత తన కొడుకు ధ్రువతో కలిసి జనవరి 27న కారులో బయటకెళ్లింది. అయితే అదే రోజు సాయంత్రం కొండనపల్లి శివారులో చనిపోయి కనిపించింది.  మమత కొడుకు నాలుగేళ్ల ధ్రువ కనిపించలేదు. హత్యకు సంబంధించి ఎలాంటా ఆధారాలు లభించలేదు. అయితే నిందితులు పరారైన కారు నంబర్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా చెన్నైలోని ఒక లాడ్జిలో ధ్రువను క్షేమంగా అతడి నానమ్మకు అప్పగించారు. అనంతరం నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. 

ఇది కూడా చదవండి: AP Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీపై చంద్రబాబు కీలక ఆదేశాలు!

ఈ క్రమంలోనే తమకు లభించిన ఆధారాలతో మమత మర్డర్ కు వివాహేతర సంబంధమే కారణమని నిర్ధరించారు. మమత తన భర్తతో దూరంగా ఉంటూ సింగరేణి ఉద్యోగి భాస్కర్‌తో సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. మమతకు అడ్డగోలుగా డబ్బులు ఇవ్వడంతోపాటు ఖర్చు చేస్తున్నాడని భాస్కర్‌ కుటుంబం కోపం పెంచుకుంది. దీంతో భాస్కర్‌ కుటుంబ సభ్యులే రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి మమతను చంపించినట్లు పోలీసులు వెల్లడించారు. సుపారీ కిల్లర్‌ కల్యాణ్‌, భాస్కర్‌ తండ్రి, భాస్కర్‌ సోదరి, రఘును అరెస్టు చేశారు. 

ఇది కూడా చదవండి: Crime News: స్కూల్లో మంటలు.. 17 మంది చిన్నారులు సజీవదహనం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు