Kakinada
ప్రస్తుత సమాజం ఎలా ఉందంటే.. మన కుటుంబం, మన సంతోషం కంటే ఇతరుల సంతోషం కోసం జీవిస్తున్నారు. పోటీ ప్రపంచంలో ఇతరులతో పడలేకపోతున్నారని, ఇటీవల ఓ తండ్రి కన్న పిల్లలను దారుణంగా హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇద్దరు పిల్లలు కూడా చదువులో వెనుకపడ్డారని, తండ్రే వారిని దారుణంగా హత్య చేశాడు. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో తన పిల్లలు ఇతరులతో పోటీ పడలేకపోతున్నారని, ఎంత మంచి స్కూల్‌లో వేసినా కూడా చదవలేకపోతున్నారని సూసైడ్ లేఖలో రాశాడు.
ఇది కూడా చూడండి: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
చదవకపోతే సెటిల్ కాలేరు ఏమోనని పిల్లలకు భవిష్యత్తు లేదని అందుకే పిల్లలను చంపేసి, తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‌లో రాశాడు. పిల్లలు చదవకపోతే ఇతరుల మాటలు భరించలేక మానసిక వేదనతో ఇలా చేసి ఉండవచ్చని అంటున్నారు. లేకపోతే ఈ విషయంలో ఎప్పటి నుంచో మానసిక ఆవేదన అనుభవిస్తున్నారేమో, అందుకే పిల్లలను హత్య చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
అసలేమైందంటే?
వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్‌జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ ఎకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.ఇతనికి భార్య తనూజ, ఇద్దరూ పిల్లలు జోషిల్ (7), నిఖిల్ (6) ఉన్నారు. అయితే పిల్లలు సరిగ్గా చదవడం లేదని వారిని ఇటీవలే స్కూల్ మార్పించారు. హోలీ సందర్భంగా చంద్రకిశోర్ శుక్రవారం భార్య, పిల్లలను తీసుకుని తమ ఆఫీసులో వేడుకలకు వెళ్లాడు. అక్కడే ఉండాలని పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు పిల్లలను తీసుకెళ్తున్నానని, పది నిమిషాల్లో వస్తానని భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు.
ఇది కూడా చూడండి: Tushar Gandhi: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...
ఎంతసేపటికీ భర్త రాకపోవడం, ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో తనూజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి చేరారు. కిటికీలోంచి చూడగా, భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా, పిల్లలిద్దరూ కాళ్లూ చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్‌లలో తలలు మునిగిపోయి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో తమ పిల్లలు రాణించడం లేరని అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్ సూసైడ్ నోటును గుర్తించారు.
ఇది కూడా చూడండి:Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!