నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కడప నారాయణ క్యాంపస్‌లో మదన్ మోహన్ అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. అయితే నిన్న ఆదివారం కావడంతో తల్లిదండ్రులు కుమారుడిని చూడటానికి హాస్టల్‌కి వెళ్లారు. ఈ కమంలో మదన్ ఇంటికి వస్తానని మారం చేశాడు. దీంతో తండ్రి వద్దని తర్వాత ఇంటికి తీసుకెళ్తా అని మందలించాడు.
ఇది కూడా చూడండి: Mahakumbhabhishekam : కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం ..42 సంవత్సరాల తర్వాత మరోసారి....
మనస్తాపం చెంది హాస్టల్ గదిలోనే..
మనస్తాపం చెందిన మదన్ హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ సిబ్బంది గమనించి మదన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. మార్గమధ్యలోనే మదన్ మృతి చెందాడు. సాయంత్రం వరకు కుమారుడితో సంతోషంగా గడిపి ఇంటికెళ్లిన తర్వాత కొడుకు మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తమ కొడుకు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!
ఇదిలా ఉండగా ఇటీవల ఒడిశాలోని మల్కన్‌గిరి అనే జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ డ్రెస్‌లో ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు షాకైపోయారు. పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు వాళ్ల తల్లిదండ్రులు రెండురోజుల క్రితమే పోలీసులు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చూడండి: Ys Jagan:వైఎస్ జగన్ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ పోలీసుల కీలక నిర్ణయం!
ఫిబ్రవరి 6న మల్కన్‌గరి జిల్లాలో స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు అదృశ్యయ్యారు. స్కూల్ నుంచి వాళ్లు ఇంటికి రాలేదు. దీంతో ఆ బాలికల తల్లిదండ్రులు వారికోసం అన్ని చోట్ల వెతికారు. ఎక్కడ చూసినా కనిపించకపోవడంతో చివరికీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగగా.. విద్యార్థులు చెట్టుకు వేలాడుతూ కనిపించారు.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్!