/rtv/media/media_files/2025/03/09/AjFKItH5oppgKvLgbSPV.jpg)
Journalist 123 Photograph: (Journalist 123)
35ఏళ్ల జర్నలిస్ట్ శనివారం నడిరోడ్డు మీద కిరాతకంగా చంపబడ్డాడు. రెండు నెలల క్రితం ఛత్తీష్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లాకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ముఖేశ్ చంద్రాకార్ మర్డర్ మరవక ముందే మరో జర్నలిస్ట్ హత్యకు గురైయ్యాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని హైవేపై ఢికొట్టి గన్స్‌తో కాల్చి చంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లో లక్నో, ఢిల్లీ జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం చేటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తి మీడియా పర్సన్‌యే కాకుండా ఆర్టీఐ కార్యకర్త కూడా. రాఘవేంద్ర బాజ్‌పాయ్ ఉత్తరప్రదేశ్‌లో ఓ హిందీ న్యూస్ పేపర్‌కు విలేఖరిగా పని చేస్తున్నాడు.
VIDEO | A regional reporter was shot dead by bike-borne assailants on the Sitapur-Delhi National Highway on Saturday. Here's what IG Range Lucknow Prashant Kumar said:
— Press Trust of India (@PTI_News) March 8, 2025
"... Police teams are investigating the matter. We will reveal the details very soon."
(Full video available… pic.twitter.com/hXOsm1IlDl
Also Read: Rains: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?
హైవేపై వేరే వాహనంతో ఢీకొట్టి కిరాతకంగా చంపారు. జిల్లా ఆస్పత్రికి తరలిస్తే డాక్టర్లు ఫస్ట్ యాక్సిడెంట్‌లో మృతి చెందినట్లు భావించారు. తర్వాత శరీరంపై మూడు బుల్లెట్ గాయాలు ఉన్నాయి. దీంతో రాఘవేంద్ర బాజ్‌పాయ్‌ది పక్కా మర్డర్ అని డాక్టర్లు తేల్చి చెప్పారు. పోలీసులు ఇంకా FIR ఫైల్ చేయలేదు. కుటుంబ సభ్యుల అధికారిక ఫిర్యాదు తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. దుండగులు మొదట అతని బైక్‌ను ఢీకొట్టి, ఆపై మూడుసార్లు కాల్చి చంపారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రాఘవేంద్రకు శనివారం మధ్యాహ్నం ఫోన్ కాల్ రావడంతో తన ఇంటి నుండి బయలుదేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే, మధ్యాహ్నం 3:15 గంటల ప్రాంతంలో అతను హైవేపై హత్యకు గురయ్యాడు. రాఘవేంద్రను ఎవరు, ఎందుకు హత్య చేశారనేది ఇంకా తెలియదు. నిందితుడిని పట్టుకోడానికి పోలీసులు 4 బృందాలను ఏర్పాటు చేశారు. మహోలి, ఇమాలియా, కొత్వాలి ప్రాంతాల్లో పోలీసు బృందాలు, నిఘా పెట్టారు.