/rtv/media/media_files/2025/03/15/pE9AlEfIuEm02Z9n7YOP.jpg)
Jharkhand crime Photograph: (Jharkhand crime)
దేశ వ్యాప్తంగా హోలీ పండుగలను ఘనంగా జరుపుకున్నారు. ఈ హోలీ వేడుకల్లో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన హోలీ వేడుకల్లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ దాడికి పాల్పడ్డారు. కొన్ని దుకాణాలకు కూడా నిప్పు అంటించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆపే ప్రయత్నం చేశారు. పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: Tushar Gandhi: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...
#WATCH | Giridih, Jharkhand: Vehicles torched after a clash broke out between two communities during Holi celebration in the Ghorthamba area (14/03) pic.twitter.com/mXElojLKMA
— ANI (@ANI) March 15, 2025
ఇది కూడా చూడండి: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
#WATCH | Morning visuals from Jharkhand's Ghorthamba area where a clash broke out between two communities during Holi celebrations yesterday. Security forces deployed at the spot. pic.twitter.com/SR9ukN0HZC
— ANI (@ANI) March 15, 2025
ఇది కూడా చూడండి: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
రంగు వేస్తానని యాసిడ్ వేసి..
ఇదిలా ఉండగా ఇటీవల హ్యాపీ హోలీ అని చెప్పి రంగు వేస్తాడనుకుంటే ఏకంగా యాసిడ్ పోసి వెళ్ళిపోయాడో దుర్మార్గుడు. హైదరాబాద్ లోని సైదాబాద్ భూలక్ష్మీ గుడిలో అకౌంటెంట్ పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. దాడి చేసిన వెంటనే దుండగుడు బైక్ పై పారిపోయాడు. ఈ ఘటనలో గుడి అకౌంటెంట్ నర్సింగ్ రావ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని స్థానికులు యశోదా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి:Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!