వదిన అక్రమ సంబంధానికి మరదలు బలి.. ఇదో దుర్మార్గపు క్రైమ్ కథ!

హైదరాబాద్ కు చెందిన డిగ్రీ విద్యార్థిని స్రవంతి సూసైడ్ కేసును పోలీసులు ఛేధించారు. అన్న భార్య శైలజనే హంతకురాలిగా నిర్ధారించారు. శైలజ అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడితో కలిసి స్రవంతిని వేధింపులకు గురి చేసినట్లు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేశారు.

New Update
RRER

Hyderabad: హైదరాబాద్ కు చెందిన డిగ్రీ విద్యార్థిని స్రవంతి సూసైడ్ కేసును పోలీసులు ఛేధించారు. తాను చేయని తప్పుకు అనవసరంగా ప్రాణాలు తీసుకుందని గుర్తించారు. అన్న భార్యనే హంతకురాలిగా నిర్ధారించారు. వదిన శైలజ ఆడిన నాటకం కారణంగానే స్రవంతి అవమానంతో ఉరేసుకుని చనిపోయినట్లు దర్యాప్తుల్లో తేలినట్లు వెల్లడించారు. ఈ దుర్మార్గపు క్రైమ్ కథ వివరాల్లోకి వెళితే..

ఫోన్ లో భయంకర నిజాలు..

హైదరాబాద్ రసూల్‌పురా ఇందిరమ్మనగర్‌కు చెందిన డిగ్రీ చదువుతున్న స్రవంతి (19) నవంబర్ 11న ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. అయితే ప్రియుడి వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ స్రవంతి తండ్రి విఠల్ ఇంటి దగ్గరలోని ఓ యువకుడిపై పోలీసులకు కంప్లైట్ ఇచ్చాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్రవంతి సెల్‌ఫోన్‌ పరీశీలించగా.. అందులోని మెసేజ్ లు అసలైన నిందితులను పట్టించాయి. యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌లో ఉంటున్న నవీన్‌కుమార్‌.. స్రవంతిని వేధింపులకు గురిచేసినట్లు గుర్తించి అరెస్ట్ చేసి విచారించగా భయంకర నిజాలు బయటపడ్డాయి. 

అక్రమ సంబంధం బయటపడుతుందని..

ఈ మేరకు స్రవంతి చావులో అన్న భార్య(వదిన) శైలజ హస్తం ఉన్నట్లు విచారణలో నవీన్ కుమార్ చెప్పాడు. శైలజతో తనకు పెళ్లికి ముందే సంబంధం ఉన్నట్లు అంగీకరించాడు. ఇటీవల శైలజను కలుస్తున్న క్రమంలో స్రవంతి గుర్తించిందని, దీంతో తమ బాగోతం భయటపడుతుందనే భయంతో కొత్త నాటానికి తెరతీశామని తెలిపాడు. స్రవంతికి ఇంటి పక్కనే ఉండే అబ్బాయితో లవ్ రిలేషన్ ఉన్నట్లు క్రియేట్ చేసి శైలజ, తాను వేధింపులకు గురిచేసినట్లు నవీన్ కుమార్ వెల్లడించాడు. వివిధ నెంబర్లనుంచి స్రవంతి ఫోన్‌కు అసభ్యకర మెసేజ్ లు పంపినట్లు అంగీకరించాడు. ఈ క్రమంలోనే వారి వేధింపులు తట్టుకోలేక స్రవంతి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు

ఇది కూడా చదవండి: Ambati Rambabu: నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌ బై...!

అయితే ఇన్నాళ్లు ప్రేమ వ్యవహారం కారణంగా చనిపోయిందనుకున్న స్రవంతి తల్లిదండ్రులు విషయం తెలియగానే గుండెలు పగిలేలా రోధించారు. కోడలే తన కూతురు ఆత్మహత్యకు కారణమైనట్లు పోలీసుల విచారణలో బయటపడటంతో కంగు తిన్నారు. నిందితురాలు శైలజతో పాటు నవీన్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

ఇది కూడా చదవండి: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nightclub Roof Collapses : కూలిన నైట్ క్లబ్..150 మంది స్పాట్ లోనే...

నార్త్‌ అమెరికా డొమినికన్ రిపబ్లిక్ లోని సంతో డామింగో నగరంలో జెట్ సెట్ నైట్‌ క్లబ్ లో పై కప్పు కూలడంతో సుమారు 18 మంది మరణించారు. 120 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Dominican Republic Nightclub Roof Collapses At Club

Dominican Republic Nightclub Roof Collapses At Club

Nightclub Roof Collapses : నార్త్‌ అమెరికా డొమినికన్ రిపబ్లిక్ లోని సంతో డామింగో నగరంలో జెట్ సెట్ నైట్‌ క్లబ్ లో పై కప్పు కూలడంతో సుమారు 18 మంది మరణించారు, 120 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మరికొంతమంది ఉండవచ్చని తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 8 న తెల్లవారుజామున 12:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!


క్లబ్ లో మెరెంగే సింగర్ రూబీపెరెజ్‌ ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రూబీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఒక సారిగా భారీ శబ్ధంతో రూప్‌ కూలిపోవడంతో అప్పటివరకు ఆనందంతో కెరింతలు కొడుతున్న వారంతా హాహాకారాలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. 

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..


ఈ ప్రమాదంలో రూబీ పెరెజ్‌ గాయపడడంతోపాటు ఆయన బృందలోని శాక్సోఫోనిస్ట్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. క్లబ్‌లో ప్రమాదం జరిగన సమయంలో  సుమారు 500 నుండి 1000 మంది ఉన్నట్లు తెలుస్తోంది.. శిథిలాల కింద మరికొంతమంది ఉండవచ్చని భావిస్తున్నారు. 400 మంది సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా  జెట్ సెట్ నైట్‌ క్లబ్ లో ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయని కానీ ఈ రోజు ప్రమాదం జరగడానికి కారణం ఏంటని మాత్రం తెలియరాలేదు. రూప్‌ బలహీనంగా ఉండటం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చన్న వాదన వినపడుతోంది.

Also Read: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

Also Read: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment