/rtv/media/media_files/2025/01/25/PRWRQVSCyhA7F8ulDlef.jpg)
Hyderabad Police identified Bollu Ramesh Missing case
Khammam: హైదరాబాద్‌కు చెందిన విద్యావేత్త బొల్లు రమేష్ మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. ఖమ్మం-సూర్యాపేట జాతీయరహదారి లింగారంతండా వద్ద మిర్చితోటలోని మృతదేహం రమేష్‌దేనని కార్కానా పోలీసులు నిర్ధారించారు. మృతుడి చేతులను తాళ్లతో బిగించి దారుణంగా కొట్టి హత్యచేసినట్లు త గుర్తించారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు చేధనలో భాగంగా మూడురోజులపాటు శ్రమించి చివరికి ట్రేజ్ చేసినట్లు తెలిపారు. జనవరి 19న తన భర్త బొల్లు రమేష్ (52) కనిపించకుండాపోయాడంటూ విక్రంపురి కాలనీకి చెందిన మహిళ నట్టి జనని మిస్సింగ్ కేసు నమోదు చేయగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మృతుడి మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఓ నిందితుడిని అరెస్టు చేశారు.
పాన్ మసాలా వ్యాపారం..
ఇక అదుపులోకి తీసుకున్న నిందితుడిని తమదైన శైలిలో విచారణ చేయగా బొల్లు రమేష్ ను హత్యచేసినట్లు ఖాద్రి అంగీకరించాడని చెప్పారు. మృతదేహానికి ఘటనా ప్రదేశంలోనే శవపరీక్షలు పూర్తి చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడు బొల్లు రమేష్ ఏపీ, తెలంగాణ పాన్ మసాలా డీలర్ గా వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ట్రేడింగ్ పేరిట బొల్లురమేష్ ను ట్రాప్ చేసి హతమార్చినట్లు విచారణలో గుర్తించారు. కేసుచేధనలో కాల్ డేటా కీలకంగా మారిందని సీఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది చెప్పారు.
ఇది కూడా చదవండి: Yamini: హిందువా? ముస్లిమా? అద్దె ఇంటి కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!
బండ్లగూడకు చెందిన వ్యాపారవేత్త అహ్మద్ ఖాద్రితో విభేదాలు ఉన్నట్లు రమేష్ భార్య ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీతో ఖాద్రిని అదుపులోకి తీసుకొని విచారించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఖమ్మం పాల్వంచలో హత్య చేసి మృత దేహాన్ని పూడ్చి పెట్టినట్లు ఖాద్రి అంగీకరించాడని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: TG News: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఇప్పట్లో లేనట్లే!