/rtv/media/media_files/2025/03/13/0D6z3jN2nuvgQUee6WPf.jpg)
Lift accident Photograph: (Lift accident)
బహుళ అంతస్థుల్లో వాడే లిస్ట్ మెయింటెనెన్స్ సరిగా లేక అనేక మంది ప్రాణాలు బలిగొంటున్నాయి. రెండు రోజుల క్రితమే మార్చి 11న ఓ పోలీస్ ఉన్నతాధికారి లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయాడు. 17వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం సరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లి అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో చిక్కుకొని మరణించారు. ఇదిలా ఉండగా.. మార్చి 12 బుధవారం రాత్రి హైదరాబాద్‌లో లిఫ్ట్ మరో ప్రాణం బలిగొన్నది.
Also read: Holi : హోలీ రోజున పోలీసుల ఆంక్షలు.. ఇలా చేస్తే పోలీస్ కేసు ఫైల్
ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంతోష్ నగర్ కాలనీలో ముజ్తాబా అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కొని నాలుగేళ్ల బాలుడు సురేందర్ చనిపోయాడు. అతని తల్లిదండ్రులు ఓ హాస్టల్ నిర్వాహకుడి దగ్గర పని చేస్తున్నారు. ఆ కుటుంబం జీవనోపాధి కోసం నేపాల్ నుంచి ఇక్కడికి వచ్చింది. వారికి లిఫ్ట్ పక్కనే ఉన్న చిన్న గదిని ఇచ్చారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో సురేందర్ ఆడుకుంటూ వెళ్లి లిఫ్ట్ డోర్స్ మధ్యలో చిక్కుకున్నాడు. బాలుడి తల్లిదండ్రులు 10 నిమిషాల తర్వాత గమనించగా రక్తం మడుగులో పడి ఉన్నాడు. అపార్ట్‌మెంట్ వాసులు బయటకు తీసి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే సురేందర్‌కు చనిపోయినట్లు డాక్టర్ చెప్పాడు.
Also read: బిగ్ షాక్ ..హైదరాబాద్లో రేపు వైన్ షాపులు బంద్ !