/rtv/media/media_files/2025/03/21/xfPNqlDQe1cphSMX8yQn.jpg)
పెళ్లికి పిలువలేదని వరుడి తండ్రిపై కాల్పులు జరిపాడో వ్యక్తి. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘాజియాబాద్ కు చెందిన ఓ యువకుడికి మార్చి 22న పెళ్లి ఫిక్స్ అయింది. అయితే మార్చి 20వ తేదీన హల్దీ ఫంక్షన్ నిర్వహించారు.
అయితే వరుడి పొరిగింటి వ్యక్తిని పెళ్లికి ఆహ్వానించలేదు. అయినప్పటికీ అతను హల్దీ ఫంక్షన్ కు ఫుల్ గా తాగి వచ్చి వరుడి తండ్రితో గొడవకు దిగాడు. వరుడి తండ్రిని అభ్యంతరకరమైన పదజాలంతో దూషించాడు. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో వరుడి తండ్రిపై కాల్పులు జరిపాడు, అంతేకాకుండా పెళ్లికి వచ్చిన వరుడి బంధువులతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
#Ghaziabad
— Lokesh Rai (@lokeshRlive) March 20, 2025
शादी में पड़ोसी को बुलाना न भूलें!
शादी के कार्यक्रम में अपने पड़ोसी को न बुलाना एक दूल्हे के बाप को भारी पड़ गया, पड़ोसी ने दोस्त के साथ मिलकर दूल्हे के पिता पर फेयर कर दिया उसके हाथ में गोली लगी है, घर में आज हल्दी का कार्यक्रम था जिसमें पड़ोसी को भी बुलाया गया था,… pic.twitter.com/3cHgd1oexo
వరుడి తండ్రి ఫిర్యాదుతో
భయపడిపోయిన నిందితుడు అక్కడినుంచి పారరయ్యాడు. వరుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఎప్పుడూ తాగి ఉంటాడని.. పెళ్లిలో ఇబ్బంది పెడతాడని భయపడి తన కుమారుడి వివాహానికి అతడ్ని పిలువలేదని వరుడి తండ్రి ఫిర్యాదులో తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read : TG SSC Exam : పదో తరగతి పరీక్షల్లో గందరగోళం ఒక పేపర్ కు బదులు మరో పేపర్