Bus fire accident: ఉద్యోగానికి వెళ్తున్న నలుగురు బస్సులో సజీవదహనం

మహారాష్ట్ర పింప్రి చించ్‌వాడ్‌లో ప్రైవేట్ ఎంప్లాయిస్‌ను తీసుకెళ్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. ఎగ్జిట్ డోర్ ఓపెన్ కాకపోవడంతో నలుగురు మంటల్లోనే చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా.. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
bus fire accident

bus fire accident Photograph: (bus fire accident)

ఓ ప్రైవేట్ కంపెనీ బస్సులో మంటలు చెలరేటి పూర్తిగా దగ్ధమైంది. అకస్మాత్తుగా మంటలు అంటుకున్న బస్సులో ఎమెర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ తెరుచుకోలేదు. దీంతో ఉన్న నలుగురు ఎంప్లాయిస్ సజీవదహనమైయ్యారు. అంతేకాదు..ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన బుధవారం ఉదయం మహారాష్ట్రలోని పింప్రి చించ్‌వాడ్‌లో జరిగింది.

Also Read: Sub Inspector: లీవ్ లెటర్ బయటపెట్టిన స్కామ్.. లేడీ SI ఊచలు లెక్కించింది

వ్యోమా గ్రాఫిక్స్‌కు చెందిన 12 మంది ఉద్యోగులు బుధవారం ఉదయం 7 గంటలకు వార్జే నుంచి హింజేవాడికి కంపెనీ మినీ బస్సులో బయలుదేరారు. బస్సు డస్సాల్ట్ సిస్టమ్స్ సమీపంలోకి రాగానే బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్‌ బస్సును స్లో చేశాడు. ప్రమాదాన్ని పసిగట్టిన నలుగురు ఉద్యోగులు ఆ మినీ బస్సు నుంచి కిందకు దిగారు. వెనుక కూర్చొన్నవారు ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆ డోర్‌ తెరుచుకోలేదు.

మంటలు పెరిగి వెనుక ఉన్న క్యాబిన్‌కు వ్యాపించాయి. దీంతో నలుగురు ఉద్యోగులు సజీవదహనమయ్యారు. మరో ఐదుగురికి కాలిన గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు.  బస్సులో మరణించిన ఉద్యోగుల మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిని వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. అందిస్తున్నారు. 

Also read: Nagpur violence : హింసకు కారణమైన ప్రధాన నిందితుడు అరెస్ట్

Advertisment
Advertisment
Advertisment