/rtv/media/media_files/2025/02/25/GFqXwwwNYTAicwMFfpwx.jpg)
elephant attack Photograph: (elephant attack)
Elephants attacked: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివరాత్రి సందర్భంగా దేవాలయానికి వెళ్తున్న భక్తులను ఏనుగులు తొక్కి చంపాయి. ఓబులవారిపల్లి మండలం వైకోట అడవుల్లో గుండాలకోన మార్గంలో సోమవారం అర్థరాత్రి కాలినడకన నీలకంఠేశ్వర ఆలయానికి వెళ్తున్నారు. దారిలో అకస్మాత్తుగా ఏనుగుల గుంపు భక్తులపై దాడి చేసింది.
Also Read: ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. పోలీసులకు లొంగిపోయిన యువకుడు
ఈ దాడిలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు మరో పురుషుడు ఉన్నాడు. బుధవారం శివరాత్రి పురస్కరించుకొని శివాలయానికి వెళ్తున్న సమయంలో ఈ విషాదం జరిగింది. మృతులు ఉర్లగట్టపోడు ఎస్టీ యానాదులుగా గుర్తించారు. గాయాలపాలైన వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.