/rtv/media/media_files/2025/03/29/k9OtCGr27VPafxzqvOdk.jpg)
Vendor Get Notices Photograph: (Vendor Get Notices )
రోడ్లపై జ్యూస్, కోడిగుడ్లు అమ్ముకునే ఇద్దరు వ్యక్తులకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఓ గుడ్ల వ్యాపారికి, ఉత్తరప్రదేశ్‌లలో జ్యూస్ షాప్ నిర్వహించే వారికి కోట్ల రూపాయల్లో ట్యాక్స్ బకాయిలు ఉన్నాయని నోటీసులు అందాయి. అది చూసిన వారు షాక్ తిన్నారు. మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో కోడిగుడ్ల అమ్ముకునే ప్రిన్స్ సుమన్ పేరుపై దాదాపు రూ.50 కోట్ల బిజినెస్ జరింగింది. జిఎస్టీ రూ.6 కోట్లు కట్టాలని నోటీసులు వచ్చేంత వరకు ఈ విషయం అతనికి కూడా తెలియదు.
6 crore notice to egg vendor: Showed tax dues by saying that the company was registered in #Delhi
— Indian Observer (@ag_Journalist) March 28, 2025
The youth said- I have not been to Delhi till date Prince's entire family is worried after receiving the #notice #GST #GSTNOTIC #DelhiNews #BreakingNews #BREAKING #India https://t.co/l5Klofcy6R pic.twitter.com/v6F4Gnv5Gr
2022లో ఢిల్లీలో ప్రిన్స్ ఎంటర్‌ప్రైజెస్ అనే ఓ కంపెనీ సుమన్ పేరు మీద రిజిస్టర్ అయి ఉందని ఐటీ శాఖ నోటీసులో తెలిపింది. ఈ కంపెనీ తోలు, కలప, ఐరన్ బిజినెస్ రన్ చేస్తోంది. గత 2 సంవత్సరాలలో భారీ లావాదేవీలు నిర్వహించిందని ఐటీ నోటీసుల్లో ఉంది. సుమన్ పర్సనల్ డాక్యుమెంట్లును వాడి ఎవరో ఈ పని చేసుంటారని అతని కుటుంబం ఆరోపిస్తోంది. అన్ని కోట్లు రూపాయలు ఉంటే.. తాను ఇంకా కష్టపడి గుడ్లు ఎందుకు అమ్మతానని అంటున్నాడు. తాను తోపుడు బండి మీద గుడ్లు మాత్రమే అమ్ముతాను. ఎప్పుడూ ఢిల్లీకి వెళ్ళలేదు, అక్కడ కంపెనీ ఉందన్న విషయం కూడా తనకు తెలియదని సుమన్ అన్నాడు.
Juice vendor gets ₹7.8 cr. tax notice !
— Indian Tax Payer (@indtxpyr) March 27, 2025
Nobody is immune to potential harassments from Income Tax Dept.
Irrespective of tax-payment & ITR filing status.
लगेगी आग तो आएंगे घर कई जद में, यहां पे सिर्फ हमारा मकान थोड़ी है - राहत इन्दोरी #AbolishIncomeTax https://t.co/SlU0RxltUc pic.twitter.com/coJxT3uANY
ఉత్తరప్రదేశ్ అలీఘర్‌కు చెందిన జ్యూస్ సెంటర్ నడిపే ఎండీ రహీస్‌కు కూడా ఇలాగే జరిగింది. రూ.7.5 కోట్లకు పైగా ట్యాక్స్ బకాయిలున్నాయని ఐటీ నోటీసులు పంపింది. 2020-21లో అతని పేరుతో కోట్ల విలువైన ఫేక్ ట్రాన్సక్షన్స్ జరిగాయి. అందుకు గాను ట్యాక్స్ కట్టాలని ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు పంపింది. రహీస్ ప్రభుత్వానికి రూ. 7,79,02,457 జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ఇందంతా మోసం మని గుర్తించిన బాధితుడు ఐటీ అధికారులను సంప్రదించాడు. రహీస్ డాక్యుమెంట్స్ ఎవరో దుర్వినియోగం చేశారని తెలుసుకున్నాడు. బన్నా దేవి పోలీస్ స్టేషన్ లో రహీస్ ఫిర్యాదు చేశాడు. రహీస్ పేరు మీద 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కోట్ల రూపాయల విరాళంగా ఇచ్చారని దర్యాప్తులో తేలింది.