/rtv/media/media_files/2025/03/28/V0e6pU7pJ1vvXbFlUCtA.jpg)
AIDS with drugs Photograph: (AIDS with drugs)
పది మందికి ఎయిడ్స్ ఉన్నట్లు డాక్టర్లు నిర్థారించారు. కారణం తెలుసుకున్న వైద్యులు షాక్ అయ్యారు. వారు తీసుకున్న డ్రగ్స్ ప్రాణాంతకమైన వ్యాధి సోకడానికి కారణమైంది. కేరళ మలప్పురం జిల్లాలోని వాలంచెరి మున్సిపాలిటీ ప్రాంతంలో ఒకేసారి 10 మందికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. అయితే ఆ 10 మంది వ్యక్తులు ఒకే సూది ఇంజెక్షన్ వాడినట్లు అధికారులు తెలిపారు. ఈ 10 మందిలో ఏడుగురు కేరళ వాసులు కాగా.. మరో ముగ్గురు వివిధ రాష్ట్రాలకు చెందినవారు అని వైద్యారోగ్య శాఖ దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఇంజెక్షన్ సిరంజీని ఉపయోగించి వారంతా డ్రగ్స్ తీసుకున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ గుర్తించింది. వైద్య అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
🚨 𝗕𝗥𝗘𝗔𝗞𝗜𝗡𝗚: 𝗦𝗵𝗮𝗿𝗲𝗱 𝗡𝗲𝗲𝗱𝗹𝗲𝘀 𝗮𝗻𝗱 𝗜𝗻𝗷𝗲𝗰𝘁𝗶𝗻𝗴 𝗗𝗿𝘂𝗴 𝗨𝘀𝗲 𝗙𝘂𝗲𝗹 𝗚𝗿𝗼𝘄𝗶𝗻𝗴 𝗖𝗼𝗻𝗰𝗲𝗿𝗻
— Resonant News🌍 (@Resonant_News) March 27, 2025
💥 𝖪𝖾𝗋𝖺𝗅𝖺'𝗌 𝖧𝖾𝖺𝗅𝗍𝗁 𝖣𝖾𝗉𝖺𝗋𝗍𝗆𝖾𝗇𝗍 𝗁𝖺𝗌 𝗋𝖺𝗂𝗌𝖾𝖽 𝖼𝗈𝗇𝖼𝖾𝗋𝗇𝗌 𝗈𝗏𝖾𝗋 𝖺 𝗌𝗁𝖺𝗋𝗉 𝗌𝗉𝗂𝗄𝖾 𝗂𝗇 𝖧𝖨𝖵… pic.twitter.com/lEo5gR2FF4
Also read: BIG BREAKING: అన్నంలో విషం కలిపిపెట్టిన తల్లి.. నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి
2025 జనవరిలో కేరళ ఎయిడ్స్ కంట్రోల్ అసోసియేషన్ వాలంచెరి మున్సిపాలిటీ ప్రాంతంలో మొదట ఒక HIV రోగిని గుర్తించింది. ఈ కేసు బయటపడిన తర్వాత.. కేరళ ఆరోగ్య శాఖ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేసినపుడు సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఈ HIV సోకిన వారంతా డ్రగ్స్‌కు బానిసలు అయ్యారని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొదటగా ఈ 10 మందిలో ఒకరికి ఎయిడ్స్ సోకగా.. అతడు ఉపయోగించిన ఇంజెక్షన్ సిరంజీని మరో 9 మంది డ్రగ్స్ తీసుకునేందుకు ఉపయోగించారని.. అందుకే వారందరికీ హెచ్ఐవీ సోకినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ 10 మందిని కేరళ వైద్య శాఖ అధికారులు తమ పర్యవేక్షణలో ఉంచారు.
Also read: Immigration Bill 2025: ఇండియా అలాంటి వారికి ధర్మసత్రం కాదన్న అమిత్ షా