/rtv/media/media_files/2025/02/11/Tbs1kcdg0M5zndBBsDHn.jpg)
Delhi boy raped Photograph: (Delhi boy raped)
ఢిల్లీలో నిర్భయ కేసు లాంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల యువకుడిని కొట్టి, కదులుతున్న బస్సులోంచి తోసివేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీకి చెందిన ఓ యువకుడు వివాహాలు, ఫంక్షన్లలో వంట చేస్తుంటాడు. అయితే ఫిబ్రవరి 1వ తేదీన ఆ యువకుడు పెళ్లిలో వంట చేయడానికి సుల్తాన్‌పూర్ దాబాస్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి బస్సులో తిరిగి ఇంటికి బయలు దేరాడు.
ఇది కూడా చూడండి: Uttarakhand:హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!
బస్సులోనే 7 కిలోమీటర్ల వరకు..
ఆ బస్సులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. అనుకోకుండా ఆ యువకుడు బస్సులో ఆహారాన్ని పడేయడంతో డ్రైవర్‌కు కోపం వచ్చి తన స్నేహితులతో ఆ యువకుడిని దారుణంగా కొట్టించాడు. బస్సులో ఓ రాడ్డు ఉండగా దానితో ఆ యువకుడిని దాదాపు 15 నిమిషాల పాటు కొట్టారు. ఆ యువకుడు స్పృహ కోల్పోయే వరకు 7 కి.మీ వరకు బస్సులో కొట్టి ఆ తర్వాత కిందకి పడేశారు. దీంతో ఆ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!
ఇంటికి రాలేదని మృతుడు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రోడ్డుపై పోలీసులు మృతదేహం లభ్యమైంది. పోలీసులు వెంటనే ఆ యువకుడికి వైద్య పరీక్షలు చేయగా.. షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
ఇది కూడా చూడండి: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!
మృతుడి ప్రైవేట్ భాగాలపై వారు తీవ్రంగా రాడ్డుతో కొట్టినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో వెంటనే పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీరిలో ఒకరిని అరెస్టు చేయగా.. బస్సు డ్రైవర్‌తో పాటు మరో నిందితుడు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.