BIG BREAKING: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది సజీవ దహనం

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మాలవీయ నగర్‌లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్పాట్‌లో 20 మంది సజీవ దహనమయ్యారు. మరో 35 మందిని సహాయక బృందాలు కాపాడాయి.

New Update
BREAKING

BREAKING

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మాలవీయ నగర్‌లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్పాట్‌లో 20 మంది సజీవ దహనమయ్యారు. మరో 35 మందిని సహాయక బృందాలు కాపాడాయి. అయితే ఈ మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. ఉదయం 8.50 గంటల సమయంలో రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ఇది కూడా చూడండి: భక్తి ముసుగులో IIT కామాంధుడు....ప్రవచనాలు చెబుతూ  అమ్మాయిలతో రాసలీలాలు!

ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. అగ్నిప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమన్నారు. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మోదీ తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు వెల్లడించారు. మృతుల్లో ఒక్కొక్కరి కుటుంబానికి PMNRF నుండి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే గాయపడిన వారికి రూ.50 వేలు ఇవ్వనున్నారు. 

Advertisment
తాజా కథనాలు