/rtv/media/media_files/2025/02/19/Xt35Ph2wHV5cMvHps2Ez.jpg)
crime Photograph: (crime)
కన్నతల్లిదండ్రులతో కూడా ఆడపిల్లలకు రక్షణ లేని రోజులు వెలుగుచూస్తున్నాయి ప్రస్తుత సమాజంలో. కామ వాంఛతో కళ్ళుమూసుకుపోయి 7 ఏళ్ళ కూతురి పై అత్యాచారానికి తెగబడ్డాడు ఓ కసాయి తండ్రి. ఆపై ఆమె గొంతుకోసి హతమార్చాడు. మానవజాతి సిగ్గుపడే ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో ప్రాంతంలో చోటుచేసుకుంది.
జ్ఞాన్ సింగ్ అనే వ్యక్తి భార్య ఐదుగురి పిల్లలతో నివాసం ఉంటున్నాడు. అయితే మార్చి 12న తన కూతుళ్లలో ఒకరి పై అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతుకోసి హతమార్చాడు. ఈ తప్పును నుంచి తప్పించుకోవడానికి మరో తప్పుడు కథను అల్లాడు. పొరుగింటివారిని ఇరికించేందుకు ప్లాన్ చేశాడు. పొరుగింటి శాంతి దేవి ఇంట్లో కూర తిని తన కుమార్తె చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కూర తిన్న తర్వాత తన భార్య, మరో ఐదుగురు పిల్లలు కూడా అనారోగ్యానికి గురయ్యారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు శాంతి దేవిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసి, ఆమెను అరెస్టు చేశారు.
పోస్టుమార్టంలో బయటపడిన అసలు నిజం
అనంతరం అతడి భార్య, పిల్లలను ఢిల్లీలోని GTB ఆసుపత్రికి తరలించారు. లైంగిక వేధింపులకు గురైన బాలిక అప్పటికే మృతి చెందగా.. చికిత్స తర్వాత మిగిలిన పిల్లలను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక్కడే తండ్రి అసలు నిజస్వరూపం బయటపడింది. నిందితుడు జ్ఞాన్ సింగ్ తన కుమార్తె మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయడానికి నిరాకరించాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తానని పోలీసులతో చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు బలవంతంగా బాలిక మృతదేహానికి స్థానిక MMG జిల్లా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం చేయించారు, అక్కడ మరణానికి గల అసలు కారణం బయటపడింది.
బాలికపై లైంగిక దాడి, గొంతు కోసి చంపినట్లు పోస్ట్‌మార్టం నివేదిక నిర్ధారించింది. దీని తరువాత, సోమవారం, లోనీ పోలీసులు సేవా ధామ్‌లోని GDA పార్క్ సమీపంలో నిందితుడు జ్ఞాన్ సింగ్‌ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. మార్చి 12 రాత్రి తన కూతురిపై అత్యాచారం చేశానని చెప్పాడు. ఆ తర్వాత ఆమెను గొంతు కోసి చంపానని తెలిపాడు. దాని నుంచి తప్పించుకోవడానికి పొరుగువారికి ఇరికించినట్లు పేర్కొన్నాడు.
Also Read: Irregular periods: పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? ఈ ఆహారాలు తీసుకోండి