/rtv/media/media_files/2025/02/21/Nw8jJqEKOuFIvDUew9Tq.jpg)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫొటోలను మార్ఫింగ్ (Photo Morphing) చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల తన కుటుంబంతో కలిసి కుంభమేళాకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ పుణ్య స్నానం ఆచరించారు. ఆ సమయంలో తీసిన ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ కొందరు బాడీ షేమింగ్ చేస్తూ మార్ఫింగ్ చేయడం వివాదస్పదంగా మారింది.
Also Read : మహా కుంభమేళా చివరి రోజు ఆకాశంలో అద్భుతం!
ఆంధ్రప్రదేశ్
— జాఫర్ షేక్ ✊ (@urs_jafar2) February 18, 2025
డిప్యూటీ సీఎం @PawanKalyan
పవన్ కళ్యాణ్ గారు
తన కుటుంబంతో కలిసి మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్ లో ఆయన పుణ్య స్నానం ఆచరించారు కుటుంబం తో కలిసి.!
పుణ్య స్నానం ఆచరించిన అనంతరం సతీసమేతంగా త్రివేణి సంగమంకు హారతులు ఇచ్చారు.!🔥🔥🔥🔥🙏#Mahakumbh #PawanKalyanAtMahakumbh pic.twitter.com/o21dXdesUG
Also Read : మిడిల్ క్లాస్ వారికి చీప్ అండ్ బెస్ట్ స్కూటర్ అంటే ఇదే భయ్యా!
ఐపీ అడ్రస్ ల ఆధారంగా
అయితే దీనిపై జనసేన (Janasena) కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేశారు. తిరుపతి వెస్ట్ పీఎస్ పరిధిలో జగనన్న సైన్యం పేరుతో ఫొటో అసభ్య మార్ఫింగ్‌పై కేసు నమోదు అయింది. ఇక చిత్తూరులో హరీష్ రెడ్డి అనే వ్యక్తి తప్పుగా పోస్ట్ పెట్టడంపై కేసు నమోదు అయింది. వీరిపై సోషల్ మీడియాలో పోస్టులపై BNS సెక్షన్లు 353(2), 356(2) కింద క్రైమ్ నంబర్లు 11, 12, 13, 14లలో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీ అడ్రస్ ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. పవన్ ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : నిర్బంధించి పంపేస్తారన్న భయంతో 11 ఏళ్ల బాలిక ఆత్మహత్య!
ఇక ప్రయాగ్ రాజ్ (Prayagraj) లో అంగరంగా వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela) కు పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా వెళ్లారు. తన సతీమణి అన్నా లెజ్నెవాతో పాటుగా కుమారుడు అకిరా నందన్‌తో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. పవన్ పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పవన్ వెంట సినీ దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు.
Also Read : Heart Stroke: డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. అదుపు తప్పిన కంటైనర్.. ఒకరు మృతి