/rtv/media/media_files/2025/02/23/sNExnIdDy3ATlMMfXKQ1.jpg)
Bihar boys gang-raped on Women
Gang rape: బీహార్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నలందలోని ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఊరికి వెళ్తున్న దంపతులను రోడ్డుపై ఆపిన దుండగులు దాడి చేసి గాయపరిచడం కలకలం రేపింది. పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేయగా మరికొంతమంది పరారిలో ఉన్నారు. ఈ అవమానవీయమైన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా..
బీహార్ నలందలోని ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన దంపతులు ఆదివారం రాత్రి తమ బంధువుల ఇంటికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్నారు. ఆ సమయంలోనే మార్గమధ్యలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు వారిని చుట్టుముట్టారు. మొదట భర్తను కొట్టి గాయపరిచారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యను కొట్టారు. వారిదగ్గరున్న 50 వేల నగదుతో పాటు బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరకుని నిందితుల్లో ఒకరిని పట్టుకున్నట్లు డిఎస్పీ గోపాల్ కృష్ణ, ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ చీఫ్ అనిల్ కుమార్ పాండే తెలిపారు.
ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
ఇక బాధిత దంపతులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి.. అత్యాచారం, దోపిడీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరైన శోభా బిఘా గ్రామ నివాసి కౌశలేంద్ర కుమార్ అలియాస్ సన్నీని అరెస్ట్ చేశారు. పరారిలో ఉన్న రెండవ నిందితుడికోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
bihar | gangrape | telugu-news | today telugu news