/rtv/media/media_files/2025/04/01/FxYeNNGFB5BPhdDX9Lw7.jpg)
Gang-Raped Near Temple In Nagarkurnool
నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట మండలంలో దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై తొమ్మిది మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల్లో ఒకరు ఊర్కొండ పేట మండలంలోని ఆంజనేయస్వామి ఆలయంలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా గుర్తించారు. ఇతడే ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. అత్యాచారానికి ముందు మహిళ కదలికలపై నిందితుల రెక్కీ నిర్వహించారు. సుమారు 2గంటల పాటు మహిళపై అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా గ్యాంగ్‌రేప్ దృశ్యాలను కూడా మొబైల్‌లో చిత్రీకరించారు దుండగులు. అర్థరాత్రి కావడంతో భయం భయంగా గడిపిన మహిళ.. ఉదయం అత్యాచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన
ఓ ముఠాగా ఏర్పడి వీరంతా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ఇక బాధితురాలు, కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ లను కూడా పోలీసులు రికార్డు చేశారు. ప్రస్తుతం బాధితురాలికి కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఊర్కోండ మండలంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద వివాహితపై తొమ్మిది మంది అత్యాచారం చేశారు. మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివాహిత ఒంటరిగా బహిర్భూమికి వెళ్లిన సమయంలో గ్యాంగ్‌రేప్ జరిగింది. మహిళ ఎంతకూ రాకపోవడంతో వెతకడానికి వెళ్లిన బంధువుపై కూడా దాడి చేసి తాళ్లతో బంధించారు దుండగులు. గ్యాంగ్ రేప్ తో పాటుగా దోపిడీ కూడా జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితుల నేరచరిత్రపై ఆరా తీస్తున్నామని ఎస్పీ గైక్వాడ్ వెల్లడించారు.
Also read : BREAKING : కమర్షియల్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు!
Also Read: Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!
Also Read:Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి