బాబా సజీవ సమాధి తవ్వకుండా అడ్డుకున్న ఫ్యామిలీ.. పోలీసుల విచారణలో బిగ్ ట్విస్ట్

కేరళలో సజీవ సమాధైన ఓ బాబా కేసు సంచలనంగా మారింది. మణ్యన్ బాబా నిజంగానే సజీవ సమాధి అయ్యారా? కుటుంబసభ్యులే చంపారా? అని స్థానికులు సమాధిని తవ్వాలని డిమాండ్ చేశారు. ఫ్యామిలీ సమాధి తవ్వకుండా అడ్డుకుంది. చివరికి సమాధి తవ్విన పోలీసులు బాబాను చూసి షాక్ అయ్యారు.

New Update
kerala baba

kerala baba Photograph: (kerala baba)

కేరళలో ఓ బాబా సజీవ సమాధి అవ్వడం.. దాన్ని కుటుంబసభ్యులే ప్రచారం చేయడం సంచలనంగా మారింది. బాబా సజీవ సమాధి అయ్యారని కుటుంబసభ్యులు అంటుంటే.. ఆయన్ని కుటుంబసభ్యులే అతన్ని చంపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయన సమాధిని తవ్వాలని కొందరు స్థానికులు డిమండ్ చేశారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. పోలీసుల ఎంట్రీతో బాబా కేసు వివాదాస్పదంగా మారింది ఈ కేసు. 

ఇది కూడా చూడండి: ఖేల్ రత్న అవార్డ్‌లు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

పోలీసులు, జిల్లా కలెక్టర్‌ సమాధి తవ్వడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఫామిలీపై అనుమానాలు ఇంకా పెరిగాయి. ఈ కేసు చివరికి కోర్టు వరకు వెళ్లింది. కోర్టు ఆదేశాలతో సమాధిని తవ్వి చూస్తే చనిపోయిన బాబా మృతదేహం ధ్యాన స్థితిలో కూర్చొని ఉండటం చూసి అంతా షాక్..!  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ బాబా సజీవ సమాధి కేసులో ఏం జరిగింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది..? వివరాలు ఇలా ఉన్నాయి. 

మణ్యన్ బాబా సజీవ సమాధి

కేరళలోని తిరువనంతపురంకు చెందిన గోపన్ స్వామి అలియాస్ మణ్యన్ అనే బాబా ఇటీవలే సజీవ సమాధి అయ్యారు. అయితే ఈ విషయాన్ని నేరుగా ఆయన కుటుంబ సభ్యులే పోస్టర్ల ద్వారా స్థానికులు అందరికీ తెలిసేలా చేశారు. పోస్టర్ల ద్వారా విషయం తెలుసుకున్న ప్రజలు అంతా ఆశ్చర్యపోయారు. అసలు ఎవరికీ తెలియకుండా ఓ దేవాలయం సమీపంలో బాబా సజీవ సమాధి కావడం వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందని భావించారు.

సమాధి తవ్వాలని స్థానికుల డిమాండ్

ఈక్రమంలోనే ఆయన కుటుంబసభ్యులను అందరూ ప్రశ్నించగా.. ఎవరికీ తెలియకుండానే తనను జీవ సమాధి చేయాలని మణ్యన్ కోరినట్లు ఆయన కుమారులు సనందన్, రాజేశన్ చెప్పారు. బాబా కుటుంబ సభ్యులు చెప్పేది అంతగా నమ్మశక్యంగా లేదని స్థానికులు, బంధువులు అందరూ పోలీసులను ఆశ్రయించారు. వివరాలు సేకరించిన పోలీసులు కలెక్టర్‌కు నివేదిక పంపించారు. ఈక్రమంలోనే సబ్ కలెక్టర్ ఆల్ఫ్రెడ్ ఓవీ తన సిబ్బందితో వెళ్లి సమాధిని తవ్వాలని ఆదేశించారు.

ఇది కూడా చూడండి: Imran Khan: పాకిస్థాన్​ మాజీ ప్రధాని​కి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష

పోలీసులను అడ్డుకున్న ఫ్యామిలీ

సమాధిని తవ్వాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ.. బాబాకుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. స్వామీజీ సమాధిని తవ్వనివ్వలేదు. సమాధి చుట్టూ ఉండి పోలీసులకు అడ్డంపడ్డారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గి న్యాయపరంగా వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. అలా ఈ కేసు హైకోర్టుకు వెళ్లింది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మణ్యన్ జీవ సమాధిని తవ్వాలని జనవరి 15వ తేదీన పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలోనే పోలీసులు జనవరి 16 ఉదయం 7 గంటలకు బాబా సమాధిని తవ్వారు. కాంక్రీట్‌తో కట్టిన సమాధిని పగులగొట్టారు.

ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్ ను పొడిచిన కత్తి ఇదే.. ఎంత లోతు దిగిందంటే?

సమాధిలో బాబాని చూసి షాక్

సమాధిలో బాబా స్థితిని చూసి పోలీసులతో పాటు అందరూ షాక్ అయ్యారు. సమాధిలో బాబా ధ్యాన స్థితిలో ఛాతి వరకు పూజా సామాగ్రి కప్పి ఉండి కనిపించాడు. ఎట్టకేలకు పోలీసులు ఆయన మృతదేహాన్ని బయటు తీశారు. ఛాతి వరకు పూజా సామగ్రితో ధ్యానంలో కూర్చుని ఉన్నట్లు పోలీసులు వివరించారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీకి తరలించినట్లు స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు