వైజాగ్‌లో రెచ్చిపోయిన కామంధులు.. పెళ్లి చేసుకుంటానని లా స్టూడెంట్‌పై..

విశాఖలో లా చదువుతున్న యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వంశీ అనే యువకుడు స్నేహితుడు గదికి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. మానసిక వేధన అనుభవించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. తల్లిదండ్రులు గమనించి అడగడంతో విషయం బయటపడింది.

New Update
Crime News : వీళ్ళసలు మనుషులేనా? చిన్నారిని చిదిమేసిన కన్నతండ్రి.. మేనమామ..అన్న! 

న్యాయాన్ని కాపాడాల్సిన లా స్టూడెంట్‌పై కొందరు కామాంధులు ఇటీవల అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలో మధురవాడలో ఓ కాలేజీలో యువతి న్యాయ విద్యను అభ్యసిస్తోంది. తనతో పాటు చదువుతున్న వంశీ అనే విద్యార్థితో ఆమె ఫ్రెండ్‌షిప్ చేసింది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను ఆగస్టు నెలలో కంబాలకొండకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఇది కూడా చూడండి: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!

స్నేహితుడు ఇంటికి తీసుకెళ్లి..

ఆ తర్వాత డాబాగార్డెన్‌లో నివాసం ఉంటున్న తన స్నేహితుడు ఇంటికి తీసుకెళ్లి మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. వంశీ తర్వాత తన స్నేహితులు ఆనంద్, రాజేష్, జగదీష్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడంతో పాటు వీడియోలు తీశారు. అక్కడికి రెండు నెలల తర్వాత మళ్లీ కాల్ చేసి తమ కోరిక తీర్చాలని.. లేకపోతే వీడియోలు బయట పెడతామని బెదిరించారు.

ఇది కూడా చూడండి: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే!

మానసికంగా కూడా ఆ యువతిని ఎంతో వేధించారు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేయగా.. తల్లిదండ్రులు గమనించి అడ్డుకుని అడిగారు. దీంతో ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి.. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

ఇది కూడా చూడండి: Etela Rajender: రేవంత్ నీ బతుకెంతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా.. ఇటీవల గుంటూరు జిల్లాలో ఓ 65 ఏళ్ల ఓ వృద్ధ కామాంధుడు 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను బడుగు నాగేశ్వరరావు (60) అనే వ్యక్తి ఇంట్లోకి పిలిచి తలుపులు వేసి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక భయంతో కేకలు వేసింది. అమ్మమ్మ, స్థానికులు గమనించి వృద్ధుడి ఇంట్లో ఉన్న బాలికను కాపాడారు.

ఇది కూడా చూడండి: 9 ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక.. షాకింగ్ వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Union Minister Grand Daughter Shot Dead : బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

కేంద్ర మంత్రి జితన్​ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి బుధవారం హత్యకు గురయ్యారు. ఆమెను భర్త రమేశ్ సింగ్​ కాల్చి చంపాడు. బిహార్​లోని​ గయా జిల్లా టెటువా గ్రామం అటారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

New Update
Union Minister Grand Daughter Shot Dead

Union Minister Grand Daughter Shot Dead

Union Minister Grand Daughter Shot Dead: కేంద్ర మంత్రి జితన్​ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి (32) బుధవారం హత్యకు గురయ్యారు. ఆమెను తన భర్త రమేశ్ సింగ్​ కాల్చి చంపాడు. బిహార్​లోని​ గయా జిల్లా టెటువా గ్రామం అటారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న అటారీ పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందింతుడు రమేశ్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

పోలీసుల కథనం ప్రకారం, మృతురాలు సుష్మా దేవి అటారీ బ్లాక్‌లో వికాస్ మిత్రాగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆమెపై రమేశ్ కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆమెను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి బంధించాడు. ఆ తర్వాత ఆమె ఛాతి భాగంలో కాల్చి పారిపోయాడు. దీంతో సుష్మా అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మగధ్ ఆసుపత్రికి తరలించారు. 'సుష్మను ఆమె భర్తే కాల్చి చంపాడు. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాం. ఫోరెన్సిక్ టీమ్​, టెక్నికల్ సెల్​ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నాం. నిందితుడిని వీలైనంత త్వరలోనే పట్టుకుంటాం' అని గయా ఎస్​ఎస్​పీ ఆనంద్ కుమార్ తెలిపారు.

Also Read: Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ (వీడియో చూశారా)

కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనుమరాలు 32 ఏళ్ల సుష్మా దేవి 14 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని ప్రేమించారు. అతడి పేరే రమేష్. వీరిద్దరూ గతంలోనే కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం బిహార్‌లోని గయా జిల్లా టెటువా గ్రామంలో ఉంటున్నారు. రమేష్ ఓ ట్రక్కు నడుపుతూ జీవనం సాగిస్తుండగా.. సుష్మాదేవి వికాస్ మిత్రగా పని చేస్తున్నారు. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. చాలా ఏళ్లుగా హాయిగా సాగుతున్న వీరి కాపురంలో ఇటీవలే గొడవలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది.  

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

అయితే ఎప్పటిలాగే వీరిద్దరూ బుధవారం రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంట్లోనే గొడవ పడ్డారు. అయితే అప్పుడు ఇంట్లో వీరి పిల్లలతో పాటు సుష్మాదేవి సోదరి కూడా ఉంది. కానీ భార్యాభర్తలు ఇద్దరు ఓ గదిలో ఉండగా.. వారంతా మరో గదిలో ఉన్నారు. ఏ విషయం గురించి వీరు గొడవ పడ్డారో తెలియదు కానీ రమేష్ ఒక్కసారిగా తుపాకీ తీసుకుని సుష్మాదేవిపై కాల్పులు జరిపాడు. ఫలితంగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో రమేష్ సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. తుపాకీ చప్పుడు వినిపించగా.. పిల్లలు, సోదరి సహా స్థానిక ప్రజలంతా అక్కడకు వచ్చారు. అయితే అప్పటికే సుష్మా దేవి ప్రాణాలు కోల్పోయి రక్తపు మడుగులో పడి ఉంది.

Also read :  Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి పక్కనే దేశీయ పిస్తోల్ దొరికింది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సుష్మా దేవి భర్త రమేష్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కేంద్రమంత్రి మనవరాలు కావడం, అదికూడా ఇంట్లో భర్త చేతిలోనే హత్యకు గురికావడంతో పోలీసులు కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈక్రమంలోనే నీమ్‌చక్ బథాని ఎస్డీపీఓ ప్రకాష్ కుమార్, ఎస్ఎస్పీ అన్వర్ జావేద్ అన్సారీ నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాట్లు చేసినట్లు గయా ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

Also Read :  ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!

Advertisment
Advertisment
Advertisment