/rtv/media/media_files/2025/04/02/N1t3W4Qpk7x4P2at0p16.jpg)
annam-sounjaya
కట్టుకున్న భర్తే వేధించడంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 3వ ఫేజ్ లో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన సాబాదు రజనీకాంత్ రెడ్డికి, వరంగల్ జిల్లా నర్సంపేట పరిధి ఖానాపురానికి చెందిన అన్నం సౌజన్యకు (29) 2020లో వివాహమైంది. సౌజన్య పేద కుటుంబం కావడంతో మేనమామలే పెళ్లి చేశారు. ఈ దంపతులు ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ కేపీహెచ్‌బీ మూడోఫేజ్‌లో ఉంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు.
భర్త అనుమానాన్ని తట్టుకోలేక
అయితే భర్త అనుమానాన్ని తట్టుకోలేక ఉద్యోగాన్ని మానేసింది సౌజన్య. భర్త తరుచూ వేధిస్తుండటంతో పెద్ద మనుషుల ముందు పంచాయితీ పెట్టించింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సోమవారం దంపతుల మధ్య కూడా మరోసారి గొడవ జరగడంతో రజినీకాంత్ తన భార్య సౌజన్యను కొట్టాడు. దీంతో ఆమె తన సోదరి ఇంటికి వెళ్లిపోయింది. మరునాడు తనతో ఇంటికి రావాలని రావాలని రజినీకాంత్ కోరగా బాబుకి అన్నం తినిపించి వస్తానని చెప్పి ఇంట్లోనే ఉండిపోయింది.
Also Read : Uttar Pradesh : భార్యకు పెళ్లి చేసిన భర్త.. సినిమా లెవల్ ట్విస్ట్ ఇచ్చిన బబ్లూ!
భర్త, అత్త, మరిది శారీరకంగా
ఆమె మేనమామలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగా ఉదయం ఉరివేసుకుంది. తన భర్త, అత్త, మరిది శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read : Rishabh Pant : పరువు తీస్తున్న పంత్.. రూ.27 కోట్ల పెట్టి కొంటే 17 పరుగులు!