/rtv/media/media_files/2025/02/15/mHAAsv3fTefjWOLscPbd.jpg)
Hyderabad Viral News: రోడ్డు మీద వెళ్తున్న ఒంటరిగా వెళ్తున్న ఓ యువతికి ముద్దు పెట్టి పరారయ్యాడు ఓ దుండగుడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) పోలీస్ స్టేషన్ పరిధిలో ని రెడ్డికాలనీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రెడ్డికాలనీ ప్రాంతానికి చెందిన ఓ యువతి గత రాత్రి 9 గంటల సమయంలో రోడ్డుపై ఉన్న టైలర్ షాపుకు బయలుదేరింది. అయితే అదే ప్రాంతంలో నివాసం ఉండే ఓ వివాహితుడు ఈ విషయాన్ని గమనించాడు.
Also Read : వల్లభనేని వంశీ అరెస్ట్..ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!
యువతి ఒంటరిగా ఉండటం.. ఆ ప్రదేశమంతా చీకటిగా ఉండటంతో ఇదే అదునుగా భావించి ఆమెను ఫాలో అయి దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఆ యువతి కేకలు వేయడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే 100కు డయల్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Also Read : RCB vs GG : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ శుభారంభం
విషయం తెలుసుకున్న స్థానికులు, యువతి బంధువులు నిందితుడు కిరాయికి ఉన్న ఇంటికి వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించారు. సదరు ఇంటి యజమాని కూడా 100 కు డయల్ చేసి నిందితుడి మీద ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న కేయూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కామాంధులను వదలకూడదని.. కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్!
ఇద్దరు షాపు ఓనర్లు అరెస్ట్..
కుళ్లిన చికెన్ అమ్మిన ఇద్దరు షాపు ఓనర్లను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ సుధీంద్ర తెలిపారు. రసూల్ పురలోని అన్నానగర్, అర్జున్ నగర్ లోని రెండు చికెన్షాపుల్లో గురువారం 600 కిలోల కుళ్లిన చికెన్ నన్ను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు షాపు ఓనర్లు ఎం.భాస్కర్, బొట్టా రవీందరు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ చికెన్ వేస్టేజ్, బోన్స్ కొన్ని నెలల వరకు నిల్వ ఉంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లకు తక్కువధర అమ్ముతున్నట్లు తెలిపారు.
Also Read : ఆర్డీవో సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు డాక్యుమెంట్లు.. ఇట్ల దొరికిపోయిండు!