/rtv/media/media_files/2025/03/05/uI9Rl0nam9DGfqUWLq7R.jpg)
పెళ్లై పిల్లలున్నప్పటికీ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో భార్యకు అనుమానం వచ్చి రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. అయితే స్పాట్ లో ఆమెకు భర్త ప్రియురాలు దొరకడంతో చితకబాదింది. భార్య వచ్చిందన్న విషయం ముందుగానే తెలుసుకున్న ఆమె భర్త చెప్పులు చేతిలో పట్టుకుని సైలెంట్ గా గోడ దూకి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృష్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ప్రైవేటు టీచర్‌తో అక్రమ సంబంధం
ప్రశాంత్, శ్వేత దంపతులుకు పన్నెండేళ్ల క్రితం పెళ్లి కాగా వీరికి ఇద్దరు పిల్లలున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే శ్వేత తండ్రి చనిపోవటంతో ఆమెకు తండ్రి చేసే ఉద్యోగం కారుణ్య నియామకం ద్వారా వచ్చింది. మంచిగా సంసారం సాగుతుందనుకున్న టైమ్ లో ప్రశాంత్ మనసు వాణి అనే మరో మహిళపై పడింది. ఇళ్లు మరిచి ప్రియురాలితో గడపడం మొదలుపెట్టాడు ప్రశాంత్. భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన శ్వేత భర్త కదలికలపై ఫోకస్ పెట్టగా ఓ అమ్మాయితో అక్రమ సంబంధం నడుపుతున్నట్టుగా గమనించింది. అతని ఫాలో కాగా హయత్ నగర్ శివారు లక్ష్మారెడ్డి పాలంలో ఉంటున్న ఓ ప్రైవేటు టీచర్‌తో ఉంటున్నట్లుగా తెలుసుకుని సడన్ గా ఎంట్రీ ఇచ్చింది. భార్య మాటలు విన్న ప్రశాంత్ అక్కడి నుంచి ఎవరికి తెలియకుండా చెప్పులు చేత్తో పట్టుకొని గోడ దూకి పారిపోయాడు. అయితే స్పాట్ లో దొరికిన వాణిని శ్వేత చితకబాదింది. తన భర్తను ఎందుకు తగులుకున్నావంటూ దాడికి దిగింది.
పోలీసులకు ఫిర్యాదు
తన తండ్రి మరణిస్తే వచ్చిన డబ్బులు తీసుకుని వ్యాపారం పెడతానని చెప్పి రూ.30 లక్షల నగదు, కారు, స్కూటీ, బంగారాన్ని వాణికి ఇచ్చాడని శ్వేత ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read : DMK Member: నీ కామం తగలెయ్యా... అందరి ముందే మహిళా కార్యకర్తతో కౌన్సిలర్ రచ్చ!