/rtv/media/media_files/2025/04/01/Krb6AGpmPruhjqN8KkAz.jpg)
peram shiva
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భోజనం చేస్తుండగానే ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. వెనక నుంచి దాడి చేసి కత్తులతో అతని గొంతుకోశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని సరిగా చూసుకోవడం లేదని సొంతమామ, బావమరిదే ఈ దారుణానికి ఒడిగట్టారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన పేరం శివ(27)తన ఇంటి పక్కనే ఉన్న రేగుల వెంకటేశు కుమార్తె భానుతో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది. అయితే కొంతకాలం వీరి సంసారం బాగానే ఉంది. అయితే ఇటీవల తరచూ దంపతుల మధ్య గొడవలు జరగుతున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు మధ్యలో రాజీ చేస్తూ వస్తున్నారు.
మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవ
దీనికి తోడు శివ నిత్యం మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య మూడు రోజుల కిందట మళ్లీ గొడవ జరిగింది. దీంతో భాను తన పాపను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం తన భార్యను పంపించాలని శివ తన అత్తింటికి వెళ్లి గొడవ చేయగా అందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో శివ తిరిగి ఇంటికి వెళ్లిపో యాడు. అయితే సోమవారం సాయంత్రం శివ మామ రేగుల వెంకటేశు, అతని కొడుకు శ్రీరామ్, బంధువులు మంగయ్య, రత్తయ్య, రాజు ఆయిల్ ఫాం గెలలు కోసే రెండు కత్తులు పట్టుకుని శివ ఇంటికి వెళ్లారు.
అక్కడ భోజనం చేస్తున్న శివను వెనక నుంచి పట్టుకుని బావమరిది, మిగిలిన వారు ఒక్కసారిగా కత్తులతో పీక కోసి అత్యంత దారుణంగా హతమార్చారు. దీంతో రక్తపు మడుగులో గిలగిలలాడుతూ శివ అక్కడికక్కడే మృతిచెందాడు. శివ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Also Read: Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!
Also Read:Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి