ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తున్న బిజినెస్ మ్యాన్‌పై కాల్పులు

ఢిల్లీ షాహదారా జిల్లాలో ఫార్శ్‌ బజార్‌ లో డిసెంబర్ 7 ఉదయం గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి సునీల్‌ జైన్‌పై కాల్పులకు తెగబడ్డారు. దుండుగులు ఎనిమిది రౌండ్స్‌ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.

author-image
By K Mohan
New Update
dhile

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాల్పులకు ఓ వ్యక్తి చనిపోయాడు. మార్నింగ్‌ వాక్‌కు చేస్తున్న బిజినెస్ మ్యాన్‌పై దుండగులు కాల్పులు జరపారు. ఢిల్లీలో ఓ వైపు పార్లమెంట్ సమాశాలు జరుగుతున్న క్రమంలో రాజధానిలో కాల్పులు సంచలనంగా మారింది. ఢిల్లీలోని షాహదారా జిల్లాలో ఫార్శ్‌ బజార్‌ ఏరియాతో (డిసెంబర్ 7) శనివారం ఉదయం గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి సునీల్‌ జైన్‌పై కాల్పులకు తెగబడ్డారు. దుండుగులు ఎనిమిది రౌండ్స్‌ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. 

ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

ఇది కూడా చూడండి: Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య

స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు అక్కడున్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సునీల్‌ జైన్‌ను కృష్ణా నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను ఓ వ్యాపారవేత్త.

కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలోని రాణిభాగ్‌లో భామ్‌భీనా గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అయితే, ఢిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగుతున్న వేళ కాల్పుల ఘటన తీవ్ర​ కలకలం సృష్టిస్తోంది. దేశ రాజధానిలోనే శాంతిభద్రతలు కరువైతే ఎలా అని పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.


ఇది కూడా చూడండి: సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Uttar Pradesh : టచ్ చేస్తే చచ్చిపోతా.. ఫస్ట్ నైట్ రోజే వరుడికి వధువు షాక్.. చివరికి బిగ్ ట్విస్ట్!

ఉత్తరప్రదేశ్‌లో ఓ వరుడికి మొదటి రాత్రే వధువు షాక్ ఇచ్చింది. శోభనం రాత్రి నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని వరుడికి బెదిరించింది. ఎంత నచ్చజెప్పినా కూడా వధువు వినిపించుకోలేదు. దీంతో వరుడు పోలీసులను ఆశ్రయించాడు.

author-image
By Kusuma
New Update
Marriage

Uttar pradesh

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. పెళ్లి జరిగి కనీసం ఒక రోజు కాకుండానే భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఎంతో పవిత్రమైన పెళ్లిని పెటాకులు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి యువతితో పెళ్లి జరిగింది.

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

పెళ్లికి ముందే ఓ అబ్బాయిని..

కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఘనంగా పెళ్లి చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. దీంతో మొదటి రాత్రే వధువు చేసిన పనికి వరుడు గజ గజ వణికి పోయాడు. శోభనం గదిలో వధువు వరుడికి ఓ వింత కండిషన్ పెట్టింది. నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని బెదిరించింది. వరుడు ఎంత నచ్చజెప్పిన కూడా వధువు వినిపించు కోలేదు. టచ్ చేయవద్దని బెదిరించింది. 

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

చివరకు వరుడు అడగ్గా.. పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించానని ఇప్పటికీ కూడా అతన్నే ప్రేమిస్తున్నానని, తనే నా భర్త అని తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ అయి కుటుంబ సభ్యులకు తెలిపాడు. అయితే ఆ వధువు ఏ మాత్రం కూడా వినకపోయే సరికి వరుడు పోలీసులను ఆశ్రయించాడు. వధువుతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

 

marriage | uttar-pradesh | national news in Telugu | today-news-in-telugu | latest-telugu-news | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment