/rtv/media/media_files/2025/04/02/BuoiEqiDz0OK6YKSAgYC.jpg)
bus-accidrent mp
మహారాష్ట్రలోని బుల్ధానాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. షెగావ్-ఖామ్‌గావ్ జాతీయ రహదారిపై ముందుగా ఒక బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో ప్రమాదానికి గురైన ఈ రెండు వాహనాలకు మరో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా.. దాదాపు 24 మంది గాయపడ్డారు.
వెంటనే క్షతగాత్రులను ఖామ్‌గావ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వేగంగా వస్తున్న బొలెరో కారు, ఎస్టీ బస్సు అకస్మాత్తుగా ఢీకొన్నాయి. ఆ తర్వాత వెనుక నుండి వస్తున్న 'ప్రి' ప్యాసింజర్ బస్సు కూడా ఈ రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, 24 మంది గాయపడ్డారు.
Buldhana, Maharashtra: A triple accident on Shegaon-Khamgaon Highway involving a Bolero, an ST bus, and a private bus killed five people and injured 24. The injured are receiving treatment at Khamgaon government hospital pic.twitter.com/dIWmrwPEN9
— IANS (@ians_india) April 2, 2025
జీరో పాయింట్ వద్ద
అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్‌లో, ఢిల్లీ-లక్నో హైవేపై, రాత్రి జీరో పాయింట్ వద్ద, అదుపుతప్పిన ట్రక్కు ఒక కారును ఢీకొట్టి దాదాపు 50 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ సమయంలో కారు కూడా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు బాలికలు మృతి చెందారు. డ్రైవర్ సహా ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. కారులో ఉన్న వారందరూ నైనిటాల్ సందర్శించడానికి వెళ్లి రోహ్‌తక్‌లోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.