Road Accident: రక్తంతో తడిసి ముద్దైన రోడ్లు.. యాక్సిడెంట్‌లో 18 మంది మృతి

దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, గుజరాత్‌లో జరిగిన మరో ఘటనలో ఏడుగురు యాత్రికులు చనిపోయారు. 

New Update
road accident

Road Accident: దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, గుజరాత్‌లో జరిగిన మరో ఘటనలో ఏడుగురు యాత్రికులు చనిపోయారు. 

కాంక్రీట్ మిక్సర్ - ఈకో వ్యాన్ రక్తపాతం

మహారాష్ట్రలోని థానే జిల్లా, కల్యాణ్-ముర్బాద్ నేషనల్ హైవే 61పై సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. గోవిలి గ్రామ సమీపంలోని రైతా బ్రిడ్జి వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఈకో వ్యాన్, ఎదురుగా వస్తున్న సిమెంట్ మిక్సర్ వాహనాన్ని అత్యంత వేగంగా ఢీకొట్టింది. సోమవారం ఉదయం సుమారు 10:45 గంటలకు వ్యాన్ కల్యాణ్ నుంచి ముర్బాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది మరణించారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. వీరిలో ఇద్దరు కాలేజీ విద్యార్థులు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది.

Also Read: ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..? 90's కుర్రాళ్ల కలలరాణి.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి

ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు ఒకదానిలోకి ఒకటి చొచ్చుకుపోయాయి. ఘటనా స్థలంలో దృశ్యాలు అత్యంత హృదయవిదారకంగా మారాయి. స్థానికులు, అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, వారిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గుజరాత్‌లో ట్రక్కు బీభత్సం 

మరోవైపు గుజరాత్ రాష్ట్రంలోనూ తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న యాత్రికులపైకి ఒక ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో రహదారులపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వేగ పరిమితిని పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మృతుల కుటుంబాలకు స్థానిక నేతలు, ప్రజలు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సమయంలోనే ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోవడం రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర శోకాన్ని నింపింది.

Advertisment
తాజా కథనాలు