Hockey: మరీ ఇంత దారుణమా! క్రికెటర్లకేమో కోట్లకు కోట్లు.. హాకీ ఆటగాళ్లకు చిల్లర పైసలా? క్రికెట్ వర్సెస్ హాకీ ఫ్రైజ్ మనీ లెక్కలపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటివలే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో మలేసియాపై భారత్ జట్టు గెలిచింది. ఈ గేమ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఆటగాడికి ఇచ్చింది 17వేల రూపాయలేనట. అదే క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కి లక్షలు ఇస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతకు 48లక్షల రూపాయల ఫ్రైజ్ మనీ ఉండగా.. క్రికెట్‌లో ఆసియా కప్ కొడితే రెండు కోట్లు ఇస్తారు. By Trinath 14 Aug 2023 in స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Cricket vs Hockey prize money: మనదేశంలో క్రికెట్‌కి ఉండే క్రేజ్ మరే ఫీల్డ్‌కి ఉండదు. సినిమా రంగం కూడా క్రికెట్ తర్వాతే. క్రికెటర్లు సంపాదించే డబ్బులు కోట్లలో ఉంటాయి.. వాళ్లు తాగే మంచినీళ్ల వాటర్ బాటిలే వేలలో ఉంటుంది. మిగిలిన క్రీడాకారులకు ఈ లక్ ఉండదు. టాలెంట్ ఉన్నా ఇతర స్పోర్ట్స్‌కి చెందిన ఆటగాళ్లు సంపాదన అంతంతమాత్రమే. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒలింపిక్ మెడల్స్ కొడితే కానీ గుర్తించవు. ఇక 2021 టోక్యో ఒలింపిక్స్‌లో టీమిండియా హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. 41 ఏళ్ల నిరీక్షణకు భారత పురుషుల హాకీ జట్టు తెరదింపుతూ మూడో స్థానంలో నిలిచి ఔరా అనిపించింది. అయినా ఆ జట్టు ఆటగాళ్ల తలరాతలు మారిపోలేదు.. కోట్లకు కోట్లు సంపాదించుకోలేదు. ఎందుకంటే వాళ్లు క్రికెటర్లు కాదు. తాజాగా ఆసియా ఛాంపియన్షిప్ హాకీ విజేతగా నిలిచిన టీమిండియాకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. నెటిజన్ల చురకలు ఇంత తక్కువనా? క్రికెట్‌లో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అందుకున్న ఆటగాడికి లక్షలు వస్తాయి. అదే హాకీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంటే పట్టుమని 17వేలు కూడా రావట. ప్రస్తుతం దీనికి సంబంధించిన లెక్కలు వైరల్‌గా మారాయి. ఇక ఆసియా ఛాంపియన్షిప్ గెలిచిన హాకీ జట్టుకు వచ్చే ప్రైజ్ మనీ 48లక్షలు. అదే క్రికెట్‌లో ఆసియా కప్ కొడితే రెండు కోట్లు వస్తాయి. ఇక్కడ స్పానర్‌షిప్‌లు, మిగిలిన ఫెక్టర్లు పక్కనపెడితే మనం ఆలోచించాల్సింది హాకీ ఆటగాళ్ల సంపాదన గురించి. క్రికెటర్లు కోట్లలో సంపాదించడం వాళ్ల టాలెంటే కావొచ్చు.. కానీ అదే సమయంలో మిగిలిన క్రీడలకు, క్రీడాకారులకు ప్రొత్సాహం ఉండాలి. అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. బీసీసీఐ అంటే సొంతంగా బోర్డు నడుపుతుంది. వరల్డ్ రిచెస్ట్ లీగ్ ఐపీఎల్ ట్యాక్స్ ఫ్రీ కూడా. ఇటు హాకీ లేదా ఇతర క్రీడాలకు ప్రభుత్వాల నుంచి అందే ప్రొత్సాహం అంతంతమాత్రమే. తప్పు ప్రభుత్వాలదే: ప్రతి ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్‌లో అసలు స్పోర్ట్స్‌కి కేటాయించేది చాలా చాలా తక్కువ. పోని ఆ డబ్బంతా క్రీడాల అభివృద్ధికి సహాయ పడుతుందా అంటే కానే కాదు.. ఆ నిధులన్ని మధ్యలోనే ఆవిరైపోతాయి. అందుకే దేశంలో చాలా మంది క్రికెటర్లు కావాలనే అనుకుంటారు కానీ ఇతర క్రీడలను కెరీర్ ఆప్షన్‌గా పెట్టుకొరు. కెరీర్‌ని రిస్క్ చేసి గేమ్‌పై మక్కువతో రాణించి దేశాన్ని గర్వించేలా చేయాలని చూసినా వాళ్లకి సపోర్ట్ ఇచ్చేవారే ఉండరు. అందుకే క్రికెట్ కాకుండా ఇతర క్రీడల్లో మనం వెనక పడిపోయాం. అతిపెద్ద జనాభా కలిగిన మన దేశం ఒలింపిక్స్‌లో పట్టుమని పది మెడల్స్ కూడా కొట్టలేని పరిస్థితి ఉంది. సంపాదన రాదని తెలిస్తే ఎవరూ కూడా కెరీర్‌ని రిస్క్ చేయరు. మరోవైపు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత హాకీ జట్టుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ. కోటీ 10 లక్షల భారీ నజరానా ప్రకటించారు. చెన్నై వేదికగా శనివారం మలేసియాతో జరిగిన ఫైనల్లో భారత్ 4-3 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అలాగే హాకీ ఇండియా కూడా జట్టులోని ప్రతీ ఆటగాడికి రూ.3 లక్షల చొప్పున, సహాయక సిబ్బందికి రూ.1.50 లక్షల చొప్పున అందిస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా మంచి విషయం.. ఇలానే ప్రొత్సహం అందిస్తే ఇతర క్రీడాకారుల జీవితాలు కూడా మారుతాయి. Yet another shining moment for Indian hockey! Kudos to the Indian Men’s Hockey Team for their outstanding victory at the Asian Champions Trophy! 🥇🏑 #HockeyIndia #HACT2023pic.twitter.com/258VeWvsJ5 — Sachin Tendulkar (@sachin_rt) August 13, 2023 #virat-kohli #rohit-sharma #cricket #hockey #asian-champions-trophy-2023-hockey మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి