Telangana: సీపీగెట్ – 2024..ఫలితాల విడుదల ఈరోజే..

రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన‌ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీపీగెట్‌) – 2024 ఫ‌లితాలు నేడు విడుద‌ల కానున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకువీటిని రిలీజ్ చేయనున్నారు.

New Update
Telangana: సీపీగెట్ – 2024..ఫలితాల విడుదల ఈరోజే..

CP GET Results: తెలంగాణలో యూనివర్శిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం పెట్టిన ఎంట్రన్స్ టెస్ట్ సీపీగెట్ ఫ‌లితాల‌ను ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్ పీ ల‌క్ష్మీనారాయ‌ణ క‌లిసి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. సీపీగెట్ ఫ‌లితాల‌ను ఉస్మానియా యూనివ‌ర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నున్నారు. 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి గానూ ఉస్మానియా, కాక‌తీయ‌, తెలంగాణ‌, పాల‌మూరు, మ‌హాత్మాగాంధీ, శాత‌వాహ‌న‌, తెలంగాణ మ‌హిళా యూనివ‌ర్సిటీతో పాటు జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజిక‌ల్ యూనివ‌ర్సిటీల్లో పీజీ కోర్సులు ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఎల్ఐసీ, ఎంఈడీ, ఎంపీఈడీతో పాటు ప‌లు కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు.

ఈ ప్రవేశాల‌కు సంబంధించిన రాత‌ప‌రీక్ష‌ల‌ను కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో జులై 6 నుంచి 16వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించారు. రోజుకు మూడు షిఫ్టుల్లో మొత్తం 41 పీజీ కోర్సులు, నాలుగు ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల‌కు రాత‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ 45 కోర్సుల‌కు 73,342 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 64,765 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు.

Also Read: PM Modi: భారతహాకీ ప్లేయర్లకు కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోదీ

Advertisment
Advertisment
తాజా కథనాలు