Uttara Pradesh : యూపీలో బీజేపీకి అవమానం.. దళితులు, నిరుద్యోగులే కారణం

మూడోసారి బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు అయితే చేస్తోంది కానీ అది అనుకున్న మ్యాచిక్ మార్క్‌ను మాత్రం దక్కించుకోలేకపోయింది.ముఖ్యంగా ఆ పార్టీకి కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లో ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. దీనికి ప్రధాన కారణం దళితులు, నిరుద్యోగులే అని విశ్లేషకులు చెబుతున్నారు.

New Update
Uttara Pradesh : యూపీలో బీజేపీకి అవమానం.. దళితులు, నిరుద్యోగులే కారణం

Uttara Pradesh : దేశంలో జనాబా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ఇది బీజేపీ (BJP) కి ఒకరకంగా కంచుకోట. ఈ రాష్ట్ంలో బీజేపీకి తిరుగులేదు. కానీ ఇది మొన్నటివరకు. ఇప్పుడు కంచుకోటకు బీటలు పడ్డాయి. 2024 ఎన్నికల్లో యూపీలో బీజేపీకి ఘోర అవమానం జరిగింది. అయోధ్య (Ayodhya) లాంటి ముఖ్యమైన నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయింది. అంతేకాదు మెజారిటీ సమాజ్‌వాద్ పార్టీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ తరువాతి ప్రభుత్వాన్ని ఎస్పీ ఏర్పాటు చేయనుంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నుంచి అధికారం చేజారిపోవడానికి ప్రధాన కారణాలు రెండు అని తెలుస్తోంది. దళితులు, నిరుద్యోగులే బీజేపీని యూపీలో ఇంటికి సాగనంపారని చెబుతున్నారు.

ఎందుకూ పనికిరాని అయోధ్య..

అయోద్య రామాలయం... రాముని పుట్టిన ప్రదేశం... బాబ్రీ మసీదు.. కోర్టులు, కేసులు.. చివరకు మోదీ (PM Modi) హయాంలో రామాలయం ప్రారంభం. దీన్ని అత్యంత అట్టహాసంగా చేశారు ప్రధాని మోదీ. మొత్తం దేశమంతా ఊగిపోయింది. ఈ విషయాన్ని ఎన్నికల్లో ట్రంప్ కార్డుగా వాడుకుందామనుకున్నారు ఆయన. కానీ దేశంలో కాదు కదా స్వయంగా అయోద్యలోనే తుస్సుమంది. వారణాసితో పాటూ యూపీలో 13 స్థానాల్లను గెలుచుకోవడానికి సహాయపడుతుందని భావించారు. కానీ అవేమీ జరగలేదు. ప్రదాని మోదీ గెలుపును కూడా లక్ష ఓట్ మెజారిటీకి కుదించేసింది. అయోధ్యలో అయితే బీజేపీ ఏకంగా ఓడిపోయింది కూడా. దాంతో పాటూ దేశంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బెంచ్ మార్క్‌ను కూడా దక్కకుండా అయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాంటే మెజారిటీ మార్క్ 272 స్థానాలు కావాల్సి ఉండగా..బీజేపీకి 240 మాత్రమే వచ్చాయి.

దళితులు, నిరుద్యోగులు...

యూపీలో బీజెపీకి అవమానం జరగడానికి... బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కాదు కదా... మెజారిటీ మార్క్‌ కూడా దక్కకపోవడానికి ప్రధానంగా దళితులు, నిరుద్యోగులే కారణం అని తెలుస్తోంది. దేశంలో యువత బీజేపీ, మోదీ విధానాల పట్ల అసంతృప్తిగా ఉంది. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం...అసలు ఎప్పుడైనా దొరుకుతుందా అనే ఆశను కూడా లేకుండా చేయడం వారిని చాలా నిరాశ పర్చింది. మరోవైపు ఆర్మీలో రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయడం, అగ్నివీర్ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా Jఊడా ఆ పార్టీకి అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది.దీని వలన యూపీలాంటి రాష్ట్రాల్లో బాగా చదువుకున్న యువత కూడా పడవ నడుపుకోవడం లాంటి పనులు చేయవలసి వస్తోంది. దేశంలో ఎక్కడ ఊసినా యువత అసంతృప్తిగానే ఉన్నారు. అలహాబాద్ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్శిటీ వంటి విద్యాసంస్థలకు పేరుగాంచిన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియని గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తోంది.

దీంతో పాటూ దళితుల ఓట్లు కూడా ఇండియా కూటమికి (INDIA Alliance) వెళ్ళాయి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బీజేపీ మార్చాలనుకుంటోంది అన్న బావన దళితుల్లో బలంగా నాటుకుపోయింది. ఇది వారిని ఆ పార్టీ నుంచి దూరం వెళ్ళేలా చేసింది. దాంతో బీజేపీ అగ్రవర్ణ హిందూత్వ సంస్కరణ కూడా దళితులను బాగా భయపెట్టింది. ఇది కూఆ వారిని కూటమి మీద దృష్టి పెట్టేందుకు దోహదపదింది. దీఈంతో పాటూ యూపీలో యోగి ఆదిత్యనాథ్ వల్ల బాధలు పడ్డ ముస్లిమ్‌లు కూడా కూటమి వైపు వెళ్ళిపోయారు. ఈ రెండు బలమైన కారణాలు యూపీలో బీజేపీకి మెజారిటీ దక్కకుండా చేశాయి.

Also Read:PM Oath Ceremony: మూడోసారి ప్రమాణానికి స్పెషల్ గెస్ట్‌లు..రానున్న విదేశీ నేతలు

Advertisment
Advertisment
తాజా కథనాలు