కానిస్టేబుల్ చొరవ..భుజాల మీద మోసి మరీ ప్రాణాలు కాపాడిన వైనం

చనిపోతున్న వ్యక్తిని మోసుకుని తీసుకెళ్ళి మరీ ప్రాణాలు కాపాడారు కరీంనగర్‌లోని ఓ పోలీస్ కానిస్టేబుల్. పురుగుల మందు తాగాడని సమాచారం అందుకున్న కానిస్టేబుల్..2 కిలోమీటర్లు పొలాల నుంచి నడిచి ఊరికి చేరుకుని అతడిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు.

New Update
కానిస్టేబుల్ చొరవ..భుజాల మీద మోసి మరీ ప్రాణాలు కాపాడిన వైనం

 Karimnagar district, Bhetigal: రక్షణ కల్పించాల్సిన ఉద్యోగం అది. నేరపరిశోధనే కాదు...అమాయకుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత వారి భుజాల మీద ఉంటుంది పోలీసులకు. చాలా మంది పోలీసులు ఎంతో నిజాయితీతో, అంకిత భావంతో ప్రజలకు సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. అలానే మరికొందరు పోలీసులు..తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాపాయస్థితిలో ఉన్న ఎందరో సామాన్యులను కాపాడి..వారి జీవితం నిలబెడుతున్నారు. గతంలో సడెన్‌గా హార్ట్‌ ఎటాక్‌ బారిన పడిన వారికి సీఆర్ చేసి కాపాడిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోబోతున్న కానిస్టేబుల్‌ కూడా అలాంటి పనే చేశారు. తాను చేస్తున్న ఉద్యోగానికి 100శాతం న్యాయం చేశారు కరీంనగర్ జిల్లాలోని కానిస్టేబుల్ జయపాల్. సమయస్ఫూర్తి, మానవతతో ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు.

ఏం జరిగిందంటే...
కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం భేతిగల్‌‌కు చెందిన కుర్ర సురేష్‌ అనే వ్యక్తి ఇంట్లో గొడవ పడి పొలం దగ్గర పురుగుల మందు తాగాడు. అక్కడ ఉన్నవారు అది గమనించి 100కు సమాచారం ఇచ్చారు. దీనికి వెంటనే స్పందించిన బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌ జయపాల్‌, హోమ్‌గార్డు కిన్నెర సంపత్‌లు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సురేష్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. అంతే జయపాల్ ఆలోచిస్తూ కూర్చోకుండా సురేష్‌ను భుజం మీద వేసుకుని ఊర్లోకి పరుగులు పెట్టారు. అలా రెండు కిలోమీటర్లు నడిచి సమయానికి అతనిని ఆసుపత్రిలో చేర్చారు. జమ్మగుంట ప్రభుత్వాసుపత్రిలో సురేష్‌ను జాయిన్ చేశారు.

జయపాల్‌కు ప్రశంసలు..

సురేష్ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడం వల్లనే అతని ప్రాణాలను కాపాడగలిగామని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి కారణమైన కానిస్టేబుల్ జయపాల్‌కు సురేష్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బ్లూ కోల్ట్స్‌ కానిస్టేబుల్‌, ఇతర సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందించారు. సురేష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

Also Read:Jobs: నిరుద్యోగులకు శుభవార్త..61,960 జీతంలో గవర్నమెంట్ జాబ్

Advertisment
Advertisment
తాజా కథనాలు