Telangana: ఆరు గ్యారెంటీల అమలుకు ఇంత ఖర్చు అవుతుంది.. కాంగ్రెస్ లెక్కలు ఇవే

తెలంగాణలో అధికారం వచ్చాక తొలిసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. అయితే ఆరు గ్యారంటీల అమలు చేసేందుకు ఈ ఆర్థిక ఏడాదికి రూ.60వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని ప్రాథమికంగా నిర్ధారించారు. మహాలక్ష్మీ పథకానికే రూ.15 వేల కోట్లు అవుతాయని అంచనా.

New Update
Telangana: ఆరు గ్యారెంటీల అమలుకు ఇంత ఖర్చు అవుతుంది.. కాంగ్రెస్ లెక్కలు ఇవే

తెలంగాణలో నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మొదటగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. రేపు ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 10వ తేదీన అసెంబ్లీలో 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసన మండిలిలో.. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.

Also Read: ఫ్లోర్ లీడర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలకు బీజేపీ

రూ.60 కోట్లుకు పైగా కావాలి 

అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌.. తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే బడ్జెట్‌లో ఈ ఆరు గ్యారంటీలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు ఈ ఏడాది రూ.60వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని ప్రాథమికంగా నిర్ధారించారు. కేవలం ఒక్క మహాలక్ష్మీ పథకం కింద ఒక్కో మహిళకు రూ.2500 చొప్పున ఇవ్వడానికి రూ.15 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టారు.

6 రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ

ఇక బడ్జెట్‌ సమావేశాలు వారం నుంచి 10 రోజుల పాటు జరిగే అవకాశాలున్నాయి. ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఈరోజు సమావేశాల అనంతరం జరిగే బీఎసీలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇక బడ్జెట్‌లోని అంశాలపై 12వ తేదీ నుంచి చర్చ జరగనుంది. సుమారు 6 రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. కానీ బీఏసీ ఇంకా ఏర్పాటు కాకపోవడంతో విపక్ష పార్టీల నేతలతో సంప్రదించి సభ నిర్వహణ తీరు తెన్నులపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోనున్నారు.ఈ బడ్జెట్ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం, కాళేశ్వరంపై విజిలెన్స్‌ రిపోర్ట్‌, కాగ్‌, ధరణి పై నివేదికలను కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

Also Read: సీనియర్ జర్నలిస్ట్ ఇంట్లో NIA సోదాలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు